మెగా అప్డేట్ : శ్రుతి హాస‌న్ వ‌చ్చేసిందిరోయ్!

-

మెగాస్టార్ న‌టిస్తున్న 154వ చిత్రంలో హీరోయిన్ గా న‌టిస్తున్న శ్రుతి హాస‌న్ ఇవాళ సెట్స్ లో జాయిన్ అయింది. ఇటీవ‌ల క‌రోనా బారిన ప‌డి తిరిగి కోలుకున్న ఆమెను చిరు బొకేతో స్వాగ‌తించారు. బాబీ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మిస్తున్నారు. వాల్తేరు వీర‌య్య అన్న‌ది వ‌ర్కింగ్ టైటిల్. దేవీ శ్రీ ప్ర‌సాద్ సంగీతం అందిస్తున్నారు.

ఇప్ప‌టికే ఈ సినిమాకు సంబంధించి ఫ‌స్ట్ లుక్ ను విడుద‌ల చేశారు. అభిమానులను ఆ పోస్ట‌ర్ ఎంత‌గానో ఆక‌ట్టుకుంది.ఇక తాజాగా శ్రుతి సెట్లో సంద‌డి చేయ‌డం మొద‌లుపెట్ట‌డంతో యూనిట్ అంతా ఆనందం వ్య‌క్తం చేస్తోంది.మ‌హిళా దినోత్స‌వం సంద‌ర్భంగా ఆమెకు చిరుతో స‌హా మిగ‌తా చిత్ర బృందం శుభాకాంక్ష‌లు తెలిపింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version