IPL 2023 : ఐపీఎల్‌లో శుభ్‌మన్ గిల్ రికార్డులు

-

క్వాలిఫైడ్-2 మ్యాచులో ముంబైపై గుజరాత్ 62 రన్స్ తేడాతో గెలిచింది. GT నిర్దేశించిన 234 పరుగుల లక్ష్యాన్ని MI చేదించలేకపోయింది. 18.2 ఓవర్లలో 171 రన్స్ కే ఆల్ అవుట్ అయింది. సూర్య 61, తిలక్ 43, గ్రీన్ 30 రన్స్ తో రాణించిన MIకి విజయాన్ని అందించలేకపోయారు.

GT బౌలర్లలో మోహిత్ 5, షమీ 2, రషీద్ 2 వికెట్లు పడగొట్టగా, లిటిల్ 1 వికెట్ తీశారు. ఆదివారం చెన్నై, గుజరాత్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది. అయితే.. ఈ తరుణంలోనే.. శుభ్మన్‌ గిల్‌ పలు రికార్డులను కొల్లగొట్టాడు. ఆ రికార్డులు ఏంటో ఇప్పుడు చూద్దాం.

* ప్లేఆఫ్స్ లో అత్యధిక సిక్సులు (10)

* ఐపీఎల్ లో అత్యధిక స్కోరు (129) సాధించిన రెండో ఇండియన్ బ్యాటర్

* ప్లేఆఫ్స్ లో అత్యధిక స్కోరు (129)

* ఒక ఐపిఎల్ సీజన్ లో అత్యధిక బౌండరీలు (111) బాదిన (సిక్స్ లు, ఫోర్లు) రెండో ఇండియన్ బ్యాటర్

* ప్లేఆఫ్స్ లో గిల్, సాయి సుదర్శన్ మూడో అత్యధిక భాగస్వామ్యం (138) నమోదు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news