ప్రభాస్‌ సినిమాలో హీరోయిన్‌ గా పీవీ సింధు ?

-

స్టార్ షట్లర్ ‘పీవీ సింధు’ తాజాగా ‘ఆలీతో సరదాగా’ ప్రోగ్రామ్ కు అతిథిగా వచ్చారు. ఈ సందర్భంగా ఆలీ అడిగిన ప్రశ్నలకు పీవీ సింధు పలు ఆసక్తికరమైన సమాధానాలు చెప్పారు. తాజాగా ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు. ఈ ప్రోమోలో సింధు టాలీవుడ్ లో స్టార్ హీరో ప్రభాస్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

ప్రభాస్ అంటే తనకెంతో ఇష్టమని, ప్రభాస్ తనకు మంచి స్నేహితుడని సింధు చెప్పింది. ఇక ఇష్టమైన కమెడియన్ ఎవరు అంటే, ఆలీ అని నవ్వుతూ చెప్పింది. ఈ క్రమంలోనే ఆలీ మరో ఆసక్తికరమైన ప్రశ్నను అడిగాడు. ‘సింధు సినిమాల్లోకి వచ్చే అవకాశం ఉందా’? అని అడిగాడు.

“ఏమో, నా బయోపిక్ ఏ ఉండొచ్చేమో ఎవరికీ తెలుసు?” అని సింధు నవ్వులు పూయించింది. అయితే, ఈ ప్రోమోలో హైలెట్ పాయింట్ విషయానికి వస్తే, ‘తాను ఎన్నో ప్రేమ లేఖలు అందుకున్నానని, ఆ లేఖలు అన్ని నేరుగా ఇంటికే వస్తుంటాయని సింధు చెప్పడం ఆసక్తిని కలిగించింది. ప్రస్తుతం ఈ ఫుల్ ఇంటర్వ్యూ కోసం నేటిజన్లు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news