“శ్యామ్ సింగరాయ్” ఓటీటీ డేట్ ఫిక్స్ !

-

టాలీవుడ్‌ స్టార్‌ హీరో, నాచురల్‌ స్టార్‌ నాని హీరోగా నటించిన తాజా సినిమా శ్యామ్‌ సింగరాయ్‌. ఈ మూవీ క్రిస్మస్‌ కానుకగా ఈ నెల 24 వ తేదీన విడుదలై.. మంచి కలెక్షన్లను రాబడుతోంది. ముఖ్యంగా.. నాని రెండు డిఫరెంట్‌ లుక్స్‌ లో కనిపించి…అందరినీ కనువిందు చేశాడు. బెంగాల్ నేపథ్యం ఉన్న కథను తీసుకుని చిత్ర బందం ఓ సందేశం ఇచ్చింది.

ఈ సినిమా కు సాయిపల్లవి నటన చాలా పాజిటివ్‌ గా మారింది. ట్యాక్సీవాలా ఫేం రాహుల్‌ సంకృత్యాన్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్‌ లోనూ మంచి వసూళ్లను రాబడుతోంది. కాగా.. శ్యామ్‌ సింగరాయ్‌ ఓటీటీ హక్కులను నెట్‌ ఫ్లిక్స్‌ సంస్థ కొనుగోలు చేసింది. ఈ మేరకు స్ట్రీమింగ్‌ డేట్‌ ను కూడా ప్రకటించింది. జనవరి 26 వ తేదీన ఈ సినిమా ను స్ట్రీమింగ్‌ చేయడానికి నెట్‌ ఫ్లిక్స్‌ ప్లాన్‌ చేస్తుంది. ఇక ఈ సినిమా కు ప్రపంచ వ్యాప్తంగా.. రూ. 22 కోట్ల ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ జరిగింది.

Read more RELATED
Recommended to you

Latest news