టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా మారిపోయాడు. ఈ మధ్యనే కార్తికేయ 2 తో భారీ హిట్ కొట్టిన నిఖిల్ సిద్దార్ధ్.. ప్రస్తుతం స్పై అనే పాన్ ఇండియా సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే మరో సినిమాకు పచ్చజెండా ఊపాడు. ఇప్పుడు మరో సినిమాను భరత్ కృష్ణమాచారి అనే దర్శకుడితో చేయనున్నట్లు అధికారికంగా అనౌన్స్ చేశాడు. ఇక ఈ మూవీ ఫస్ట్ లుక్ ను కూడా రేపు విడుదల చేస్తున్నారట. ఈ సినిమాను భారీగా తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్నారట. ఈ సినిమాను పిక్సెల్ స్టూడియోస్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా రవి బస్రుర్ ను ఎంపిక చేసుకున్నారు.
ఇతను యష్ నటించిన యాక్షన్ మూవీ కెజిఎఫ్ కు సంగీతాన్ని అందించి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపును పొందాడు.