హాట్ టాపిక్ గా మారిన సిద్దార్థ్ – అదితి రావు ల ఫొటోస్..!

-

గత కొద్దిరోజులుగా హీరో సిద్ధార్థ్, అదితి రావ్ హైదరి ప్రేమలో పడిపోయారు అని.. డేటింగ్ కూడా చేస్తున్నారు అంటూ వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి. అయితే వీరిద్దరూ ప్రేమలో ఉన్నారు అంటూ వచ్చిన వార్తలపై ఈ జంట ఖండించింది. కానీ తాజాగా హీరో శర్వానంద్ ఎంగేజ్మెంట్ కి వీరిద్దరూ జంటగా హాజరయ్యి అందరికి షాక్ ఇచ్చారు. దాంతో ఈ జంట మళ్లీ వార్తల్లో నిలిచింది. ఇప్పటికే లవర్ బాయ్గా టాలీవుడ్ లో మంచి పేరు తెచ్చుకున్న ఈయన గతంలో కూడా చాలామంది హీరోయిన్స్ తో ప్రేమాయణం నడిపాడు. కానీ ఏ ఒక్కటి కూడా వర్కౌట్ కాలేదు.

చాలాకాలం తర్వాత హైదరాబాద్ బ్యూటీ అదితి రావు హైదరితో రిలేషన్ లో ఉన్నారు అని తెలుస్తోంది. అంతేకాదు వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారు అన్నట్టుగా కూడా వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా గతంలో కూడా ముంబైలోని ఒక హోటల్లో వీరిద్దరూ కలిసి కెమెరా కంటికి చిక్కారు. సోషల్ మీడియాలో కూడా సిద్ధార్థ్ , అదితి.. తమ బర్తడే లకు పెట్టిన పోస్ట్లు , ధరించే దుస్తులతోనూ వారి రిలేషన్ గురించి హింట్ ఇస్తున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా నిన్నటి వరకు ప్రేమ, పెళ్లి డేటింగ్ అంటూ వచ్చిన వార్తలపై వీరు ఏ విధంగా కూడా స్పందించలేదు.

ఇప్పుడు జంటగా కనిపించి అభిమానులకు షాకిచ్చారు.ఇప్పటికే వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నట్టు నెట్టింట పుకార్లు షికారు చేస్తున్న నేపథ్యంలో వీరు ఇలా జంటగా శర్వానంద్ ఎంగేజ్మెంట్ కి రావడంతో ఆ వార్తలకు బలం చేకూరుతోంది. హీరో శర్వానంద్ వివాహం చేసుకొని కొత్త జీవితంలోకి అడుగుపెట్టబోతుంటే మరో జంట కూడా పెళ్లికి సిద్ధమవుతోంది అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. మరి ఈ విషయంపై స్పష్టత రావాలి అంటే ఇద్దరిలో ఎవరో ఒకరు క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news