నారా లోకేష్..తొలి రోజు పాదయాత్రకు రూ.10 కోట్లు ఖర్చు !

-

టిడిపి నేత నారా లోకేష్ కుప్పం నుంచి ఇవాళ నుంచి ప్రారంభిస్తున్న యువగళం పాదయాత్రకు రూ. 10 కోట్ల భారీ వ్యయంతో ఏర్పాటు చేస్తున్నారు. తొలి రోజు కేవలం సభా ప్రాంగణంలో వేదిక, కటౌట్లు, హోల్డింగ్ లకు ఐదు కోట్ల మేర ఖర్చు చేస్తున్నారు.

జన సమీకరణ కోసం మరో రూ. 5 కోట్లు వెచ్చిస్తున్నట్లు సమాచారం. కుప్పంలోని కమతమూరు రోడ్డులో టిడిపి నేతలకు చెందిన పది ఎకరాల విస్తీర్ణంలో బహిరంగ సభకు వారం రోజులుగా ఏర్పాటు చేస్తున్నారు. పాదయాత్రకు కుప్పం నియోజకవర్గంలో ఒక్కో పంచాయతీ నుంచి 300 మందిని తరలించాలని టిడిపి క్యాడర్ కు అధిష్టానం ఆదేశాలు జారీ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news