బ్యాట్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్.. యాక్టర్ సిద్ధార్థ్ క్షమాపణలపై స్పందించి. ‘‘ అతను ( సిద్ధార్థ్) తన గురించి మొదట ఏదో అన్నాడు. ఆ తరువాత క్షమాపణలు చెప్పాడు. ట్విట్టర్ లో నన్ను ట్రెండ్ చేయడం చూసి ఆశ్చర్యపోయానని.. ఇది ఇంతలా వైరల్ అవుతుందని అనుకోలేదని.. సిద్ధార్థ్ క్షమాపణలు చెప్పినందుకు సంతోషం. మీరు స్త్రీలను అవమానించకూడదని.. దేవుడు అతన్ని ఆశీర్వదించాలి’’ అని సైనా నెహ్వాల్ వ్యాఖ్యలు చేసింది.
ఇటీవల సిద్ధార్థ్, సైనా నెహ్వాల్ పై అనుచిత పదజాలంతో, అవమానించేలా ట్విట్టర్ ద్వారా పలు వ్యాఖ్యలు చేశాడు. దీనిపై దేశ వ్యాప్తంగా వ్యతిరేఖత వచ్చింది. ముఖ్యంగా మహిళలు సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. ఈ వివాదంపై జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ రేఖా శర్మ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్ధార్థ్ ట్విట్టర్ అకౌంట్ బ్లాక్ చేయాలని ఆదేశించింది. మహారాష్ట్ర డీజీపీకి సిద్ధార్థ్ పై కేసు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది జాతీయ మహిళ కమిషన్. కేంద్ర న్యాయ శాఖా మంత్రి కిరణ్ రిజిజు సహా పలువురు ప్రముఖులు సైనాకు అండగా నిలబడ్డారు. ఒలింపియన్‌పైన ఇలాంటి నీచపు వ్యాఖ్యలు చేయడం సరికాదని సిద్ధార్థ్ తీరుపై మండిపడుతున్నారు.