ఎక్కువ మంది ఎదుర్కొనే సమస్యలు డయాబెటిస్ కూడా ఒకటి. చాలామంది డయాబెటిస్ బారిన పడుతున్నారు. డయాబెటిస్ ఉంటే హృదయ సంబంధిత సమస్యలు, బీపీ, కిడ్నీ సమస్యలు వంటి సమస్యలు కూడా వస్తాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఇవి డయాబెటిస్ కి సంకేతం. మరి ఇవి మీకు ఉంటే జాగ్రత్తగా ఉండండి.
నోటి దుర్వాసన:
మాటిమాటికీ నోరు ఎండిపోతుంటే నోట్లో బ్యాక్టీరియా పెరిగి దుర్వాసన వస్తుంది ఈ సమస్య ఉంటే డయాబెటిస్ ఉండొచ్చని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
ఎక్కువ దాహం వేయడం:
డయాబెటిస్ వచ్చే ముందు దాహం విపరీతంగా వేస్తుందట. అలానే డిహైడ్రేషన్ సమస్య కూడా వస్తుంది.
కళ్ళు సరిగా కనబడవు:
డయాబెటిస్ వచ్చే ముందు కళ్ళు సరిగా కనబడవు. అయితే షుగర్ లెవల్స్ ను కంట్రోల్ చేసుకుంటే కళ్లు మళ్లీ బాగానే కనబడతాయి.
ఉన్నట్టుండి బరువు తగ్గిపోవడం:
ఉన్నట్టుండి బరువు తగ్గిపోతే కూడా డయాబెటిస్ రాబోతోందని అర్థం బాడీకి కావాల్సినంత ఎలర్జీ లేకపోవడం వలన ఇలా జరుగుతూ ఉంటుంది. ఎనర్జీ కోసం కండరాల్లో ఫ్యాట్ ని ఉపయోగించుకుంటుంది దీని మూలంగా మీరు బరువు తగ్గిపోతారు.
నీరసంగా ఉండటం:
డయాబెటిస్ రాబోతున్న వారికి కార్బోహైడ్రేట్స్ అందుబాటులో ఉండవు. దీని మూలంగా నీరసంగా ఉంటుంది.
వాపులు కలగడం:
దురద, మంట, వాపు, శరీరం కంది పోయినట్లుగా ఉండడం ఇవన్నీ కూడా షుగర్ రాబోతున్న వాళ్ళలో కనబడతాయి.
నల్లని మచ్చలు:
మెడ వెనుక భాగం నల్లగా అయ్యినా చంకల్లో నల్లటి మచ్చలు వస్తున్నా డయాబెటిస్ రాబోతున్నట్లు అర్థం.