ఆ మంత్రి కామెంట్లు కేసీఆర్ ప్లాన్‌కు బ్రేక్ వేస్తున్నాయా..?

-

ఒక్కరు కాదు ఇద్దరు కాదు వరుసగా ముగ్గరు మంత్రులు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఒకరేమో లేడీ ఆఫీసర్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తే, మరో మంత్రి విద్యార్థిని బెదిరించి అబాసుపాలయ్యాడు. తాజాగా వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి ఏకంగా నిరుద్యోగుల మనోభావాలు దెబ్బతినేవిధంగా ప్రవర్తించాడు. హుజురాబాద్ ఉప ఎన్నిక సమీపిస్తున్న తరుణంలో మంత్రుల వ్యాఖ్యలు ప్రభావం చూపిస్తాయని ప్రజలే కాకుండా టీఆర్ఎస్ నాయకులు కూడా అంటున్నారు.

రాష్ర్టంలో ఉద్యోగ ప్రకటనల విషయంలో అవుతున్న నానా యాగీని చల్లార్చేందుకు గులాబీ అధినేత కేసీఆర్ 50 వేల ఉద్యోగాలంటూ… ప్రకటనను తెర మీదకు తెచ్చాడు. కానీ తాజాగా ఓ టీఆర్ఎస్ మంత్రి నిరుద్యోగులపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద దుమారం రేపాయి. మంత్రి వ్యాఖ్యలకు నిరసనగా చాలా మంది రోడ్లెక్కి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడికక్కడ మంత్రి దిష్టిబొమ్మలను దహనం చేస్తూ… తమ వ్యతిరేఖతను తెలియజేస్తున్నారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు అధినేత కేసీఆర్ కు తలనొప్పిగా మారాయని పలువురు చెబుతున్నారు.

కాగా మంత్రి నిరుద్యోగుల మనోభావాలను దెబ్బతీసాడంటూ ప్రతిపక్షాలు, విపక్షాలు పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తున్నాయి. అసలే చాలా రోజుల నుంచి ఎటువంటి నోటిఫికేషన్లు లేక నిరుద్యోగులు లెటర్లు రాసి ఆత్మహత్యలు చేసుకుంటున్న తరుణంలో మంత్రి నిరుద్యోగులు హమాలీ పనులు చేసుకోవాలని వ్యాఖ్యానించడం పెద్ద దుమారాన్ఏ రేపింది. మంత్రుల వ్యాఖ్యలతో కంగుతిన్న అధికార పార్టీ నేతలు ఇలాంటి వ్యాఖ్యలు ఎలా చేస్తారని వాపోతున్నారు. ఈ వ్యవహారంలో గులాబీ బాస్ కూడా సీరియ‌స్‌గానే ఉన్నాడని సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news