టాలీవుడ్ హీరో మహేష్ బాబు ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. హీరో మహేష్ బాబుకి మాతృ వియోగం కలిగింది. అనారోగ్య సమస్యలతో మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి కన్నుమూశారు. అయితే..ఇందిరా దేవి కన్నుమూయడంతో ఆమె మనవరాలు, మహేష్ బాబు కూతురు సితార తట్టుకోలేకపోతోంది. ఇంద్రాదేవి భౌతిక కాయం వద్ద మహేష్ పై కూర్చొని నానమ్మను గుర్తు చేసుకుంటూ వెక్కివెక్కి ఏడ్చింది. మహేష్ ఆమెను ఎంత ఓదార్చిన సితార దుఃఖం ఆపుకోలేకపోయింది. నానమ్మ అంటే ఆమెకు ఎంతో ప్రేమ అని, తరచూ ఇందిరా దేవిని చూసేందుకు వెళ్లేదని సన్నిహిత వర్గాలు తెలిపాయి.
ఇక అటు మహేష్ బాబు తల్లి మరణం..పట్ల పవన్ కళ్యాణ్, చిరు సంతాపం తెలిపారు. ప్రముఖ నటులు శ్రీ కృష్ణ గారి సతీమణి, శ్రీ మహేష్ బాబు గారి మాతృమూర్తి శ్రీమతి ఇందిరాదేవి గారు తుది శ్వాస విడిచారనే విషయం విచారం కలిగించిందన్నారు పవన్ కళ్యాణ్. శ్రీమతి ఇందిరా దేవి గారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. ఈ బాధ నుంచి శ్రీ కృష్ణ గారు, శ్రీ మహేష్ బాబు గారు త్వరగా కోలుకొనే మనో ధైర్యాన్ని ఆ భగవంతుడు ప్రసాదించాలని ప్రార్థిసున్నానని తెలిపారు పవన్ కళ్యాణ్.
Stay Strong #Sithara Papa 😭😭 #RIPIndraDeviGaaru @urstrulyMahesh anna #Krishna Gaaru We Are with you pic.twitter.com/Utz6XDnfDh
— Major Gollapati (@Ongole_MBFT) September 28, 2022