అమెరికాలో అతిపెద్ద దుమ్ము తుఫాను ఏర్పడింది. గంటకు 60 మైళ్ల వేగంతో బలమైన గాలులు వీచాయి. ఈ దుమ్ము తుఫానుతో అల్లకల్లోలం సృష్టించింది. అమెరికాలోని మెంటానా రాష్ట్రంలో ఏర్పడిన భారీ దుమ్ము తుఫాను వల్ల ఆరుగురు మృతి చెందారు. గంటకు 60 మైళ్ల వేగంతో వీచిన బలమైన దుమ్ము తుఫానుతో హార్డిన్ సమీపంలో మోంటానా ఇంటర్ స్టేట్ హైవే రోడ్డుపై వెళ్తున్న వాహనాలు నిలిచిపోయాయి.
ఈ తుఫాను వల్ల కిలో మీటర్ల మేరా దారి కనిపించకుండా పోయింది. ట్రాక్టర్ ట్రయిలర్లు, కార్లు తదితర 21 వాహనాలు ప్రమాదానికి గురైనట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు అధికారులు అప్రమత్తమయ్యారు. తుఫాన్ సమీప ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు. అలాగే ఘటనలో మృతి చెందిన ఆరుగురిని, క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. అయితే కొద్దిసేపటి వరకు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.