మొబైల్ లో గేమ్ ఆడుతూ చనిపోయిన బాలుడు

-

ఈ జనరేషన్ పిల్లలు పొద్దున లేచినప్పటి నుంచి ఫోన్ లోనే మునిగితేలుతుంటారు. చిన్నపిల్లలు కూడా 24 గంటలు ఫోన్లలోనే బిజీ అవుతున్నారు. గేమ్స్ ఆడుతూ టైంపాస్ చేస్తుంటారు. అయితే ఈ గేమింగ్ కి ఎంతగా బానిసలవుతున్నారంటే.. గేమ్ లో ఓడిపోయినా.. తల్లిదండ్రులు ఆడనివ్వకపోయినా ఆత్మహత్యలకు పాల్పడే అంత పిచ్చిగా మారిపోతున్నారు. ఇక ఫోన్ లో గేమ్ ఆడుతున్నప్పుడు చుట్టూ ఏం జరుగుతుందో కూడా పట్టించుకోరు. అలా గేమ్ ఆడుతున్న ఓ బాలుడు తనను పాము కాటు వేసింది కూడా గమనించలేదు. అలాగే గేమ్ ఆడుతూ ఒక్కసారిగా కుప్పకూలాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్ లో చోటుచేసుకుంది.

అసలేం జరిగిందంటే.. మధ్యప్రదేశ్ లోని ఇందోర్ చందన్​నగర్ పోలీస్​ స్టేషన్​ పరిధిలో ఓ కుటుంబం ఇటుక బట్టీలో పని చేస్తోంది. వారి పిల్లాడు ఫోన్​లో ఆన్​లైన్​ గేమ్​లకు బానిసయ్యాడు. పెద్దవారు పనిచేస్తున్న సమయంలో ఒళ్లు తెలియకుండా ఫోన్​లో ఫ్రీ ఫైర్​ గేమ్​ ఆడుతున్నాడు. పాము వచ్చి బాలుడిని కాటు వేసింది. అయినా అతడు గేమ్​ ఆడుతూనే ఉన్నాడు. ఒక్కసారిగా కుప్పకూలిన ఆ బాలుడిని గుర్తించిన ఇసుక బట్టీ యజమాని వెంటనే ఆస్పత్రికి తరలించాడు. చికిత్స పొందుతూనే ఆ బాలుడు మృతి చెందాడు.

Read more RELATED
Recommended to you

Latest news