నిన్న ఇండియాపై పాక్ గెలిచిన సంగతి తెలిసిందే. అయితే.. ఇండియా – పాక్ మ్యాచ్ పై విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆసియా కప్‌లో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఓడిందని మనోళ్లు నిరాశ పడటం… గెలిచినందుకు పాక్ సంబరాలు చేసుకోవడం పూర్తిగా అర్థరహితమన్నారు. భారత్‌తో ఎక్కువగా ఓడిపోతూ వస్తున్న పాక్‌లో వారి విజయాన్ని సంబరం చేసుకోవడం వాళ్ళకి బాగుంటుంది కానీ, మనం బాధపడటంలో ఏమాత్రం అర్థం లేదని పేర్కొన్నారు. భారత అభిమానులు ఈ ఓటమికి ఏ మాత్రం విలువ ఇచ్చినా భారత్‌కి పాక్ సమఉజ్జీయే అని అంగీకరించినట్టే అవుతుందన్నారు.
ఆస్ట్రేలియా, వెస్టిండీస్, ఇంగ్లండ్, న్యూజిలాండ్, శ్రీలంక లాంటి క్రికెట్ దిగ్గజాలు… బంగ్లాదేశ్, హాలాండ్, ఆఫ్ఘనిస్తాన్, జింబాబ్వే లాంటి పసికూనలు ఎన్నో టోర్నీలు ఆడుతుంటాయి. ఎన్నో దేశాలపైన పదే పదే విజయాలు సాధించిన మన టీమిండియాకి ఈ ఓటమి ఒక లెక్క కానే కాదు. అప్పుడప్పుడూ ఎదురయ్యే ఓటముల్లో ఇదీ ఒకటి, అంతే… అయితే మన దేశంలో ఉగ్రవాదానికి ఊతమిస్తూ… మనని నిరంతర శత్రువుగా చూస్తూ…. తన ఆర్థిక వ్యవస్థని నాశనం చేసుకుని… దారుణంగా అప్పులపాలై… చివరికి జూలోని జంతువుల్ని కూడా అమ్ముకుంటూ… ఏ విషయంలోనూ మనకి సరితూగని పాకిస్తాన్ ఏదో ఒక మ్యాచ్‌లో టీమిండియాపై గెలిచినంత మాత్రాన అదేదో పెద్ద విషయం అన్నట్టు చూడటం మన స్థాయికి తగని వ్యవహారం అన్నారు.
ఇండియా-పాక్ క్రికెట్ మ్యాచ్‌లకి మీడియా కూడా అంత ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం లేనే లేదు. టెన్నిస్, జిమ్నాస్టిక్స్, సాకర్, హాకీ లాంటి ఎన్నో క్రీడల్లో ప్రపంచ దేశాలన్నీ పెద్దవైనా… చిన్నవైనా పాల్గొని పతకాలు సాధిస్తుంటాయి. ఈ ఒక్క క్రికెట్ కోసం… ఇది మాత్రమే ఆట అన్నట్టు… పాక్ మాత్రమే మనకి పోటీ అన్నట్టు… వేరే దేశాలు, ఇంకే ఆటలు లేనట్టు భావించే ప్రయాసకు కోట్లాది భారతీయుల్ని గురి చెయ్యడం అసమంజసం. మన టీమిండియా రికార్డులకి రికార్డులే తిరగరాసింది… రాస్తుందని తెలిపారు విజయ శాంతి.