బలవంతంగా బీజేపీలోకి చేరికలు..రాజగోపాల్ రెడ్డి వీడియో వైరల్ !

-

మునుగోడు ఉప ఎన్నిక రాష్ట్రంలో వేడి పుట్టిస్తుంది. ప్రధాన పార్టీలు సమాయత్తం అవుతున్న నేపథ్యంలో కీలకంగా మారనుంది. అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారనున్నాయి ఈ ఎన్నికలు. కాంగ్రెస్ పార్టీకి, శాసనసభ సభ్యత్వానికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో మునుగోడు ఉపఎన్నిక కాయమనే విషయం తెలిసిందే.

ఇక మునుగోడు ఉపఎన్నిక అన్ని రాజకీయ పార్టీలకు కీలకంగా మారడంతో ప్రధాన పార్టీలన్నీ మునుగోడుని హస్తగతం చేసుకోవడం కోసం వ్యూహాత్మకంగా ముందుకు వెళుతున్నాయి. ఈ నేపథ్యంలోనే.. పార్టీలో చేరికలకు ఆయా పార్టీలు ఆహ్వానిస్తున్నాయి.

టీఆర్‌ఎస్‌ నుంచి బీజేపీ, బీజేపీ నుంచి కాంగ్రెస్‌, బీజేపీ నుంచి టీఆర్‌ఎస్‌, ఇలా ఒక పార్టీ నుంచి మరో పార్టీకి వెళుతున్నారు నేతలు. ఈ నేపథ్యంలోనే నిన్న మునుగోడులో నిర్వహించిన సభలో కోమటి రెడ్డి రాజగోపాల్‌ రెడ్డి.. సమక్షంలో బీజేపీ పార్టీలో కొంత మంది నేతలు చేరారు. ఈ నేపథ్యంలో ఓ వ్యక్తికి బలవంతంగా… బీజేపీ కండువా కప్పారు కోమటి రెడ్డి రాజగోపాల్‌ రెడ్డి. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌ గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news