కొంత మందికి మందు ఎక్కువైతే ఎం చేస్తారో కూడా అర్ధం కాదు. పీకల వరకు తాగి ఎవరో ఒకరిని ఇబ్బంది పెట్టడమో వాళ్ళను వాళ్ళు ఇబ్బంది పెట్టుకోవడమో చేస్తూ ఉంటారు. ప్రమాదకరమైన విన్యాసాలు చేస్తూ వాళ్ళు చేసే చేష్టలు వాళ్లకు ఎదుటి వాళ్లకు కూడా ఇబ్బందికరంగానే ఉంటాయి. తాగినప్పుడు సైలెంట్ గా ఉంటే ఏ గోలా ఉండదు. కాని వాళ్ళు అలా ఉండటానికి ఇష్టపడరు.
తాజాగా ఒక వ్యక్తి మందు ఎక్కువై తాచు పాముతో ఆటలు ఆడాడు. ఒక వ్యక్తి ఫుల్గా మద్యం తాగి పొలం మధ్యలో వెళ్తున్న సమయంలో అతనికి తాచు పాము కనపడింది. సాధారణంగా పాముని చూస్తే కాస్త భయపడి వెనక్కు తగ్గుతాం. అది ఎక్కడ కరుస్తుందో అని భయపడి జాగ్రత్తగా పక్కకు తప్పుకుంటాం. కాని బాబు మాత్రం తాగి ఉండడంతో ఆ పామును రెచ్చగొడుతూ కింద కూర్చొని పాటలు పాడాడు.
పాముు పడగవిప్పి ఆడుతు౦టే మనవాడు మరింత చెలరేగిపోయాడు. భయంతో పాము అక్కడి నుంచి వెళ్తుంటే వెంటబడి మరీ తోకను పట్టుకున్నాడు. పాము మూడు సార్లు కాటేసినా సరే అలాగే చేస్తున్నాడు. అక్కడ ఉన్న స్థానికులు కేకలు పెట్టినా ఆ పాముని వదిలిపెట్టలేదు. మేడలో వేసుకుని ఆటలు ఆడాడు. అతని హింస తట్టుకోలేక పాము చనిపోయింది. అతను ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన రాజస్థాన్ లో జరిగింది.