నత్త జిగురుతో సబ్బుల తయారీ.. ఫ్రాన్స్ దేశస్తుడి సరికొత్త వ్యాపారం.

-

మనం వాడే సబ్బులు శరీరం మీద క్రిములని పోగొట్టి ప్రశాంతతని తీసుకొస్తాయన్న మాట నిజమే కానీ, సబ్బుల ప్రాముఖ్యత యవ్వనంగా ఉంచడానికే అని చాలా మంది నమ్ముతారు. అందుకే రెగ్యులర్ గా తాము వాడే సబ్బులు కాకుండా ఇతర సబ్బులు వాడడానికి ఇష్టపడరు. కానీ మార్కెట్లోకి మంచి సబ్బు, మీ యవ్వనాన్ని కాపాడే సబ్బు వచ్చిందనుకోండి. అప్పుడేం చేస్తారు. వెంటనే అటువైపు వెళ్తారా? ఐతే మీరు ఇది తెలుసుకోవాల్సిందే. నత్తల జిగురుతో తయారు చేస్తున్న కొత్త సబ్బు గురించి తప్పక తెలుసుకోండి.

ఫ్రాన్స్ కి చెందిన డానియల్ డెస్రోచర్ అనే వ్యక్తి, నత్తల జిగురుతో సబ్బులు తయారు చేస్తున్నాడు. నత్తల నుండి విడుదలయ్యే జిగురు వల్ల తయారైన సబ్బు, చర్మాన్ని యవ్వనంగా ఉంచేందుకు మేలు చేస్తుందని, దానికోసం ప్రత్యేకంగా నత్తల ఫామ్ నే ఏర్పాటు చేసాడు. సుమారు 60వేల నత్తలని అందులో పెంచుతున్నాడు. ఆ నత్తలు పునరుత్పత్తి దశకి రాగానే వాటిని వేరే షెడ్ లోకి మార్చి మిగిలిన వాటిని మరో షెడ్ లో ఉంచుతున్నాడు. ఈ విధంగా నత్తలను పెంచుతూ వాటి నుండి వచ్చే జిగురును మాత్రం తీసుకుంటున్నాడు.

చేతితో నత్తలకి ఎలాంటి హాని కలగకుండా సేకరించవచ్చని, దీనిలో ఎలాంటి హింస లేదని, కేవలం చేతిద్వారానే నత్తల జిగురును తీయవచ్చని తెలిపాడు. ఒక నత్త దాదాపుగా రెండుగ్రాముల జిగురును ఉత్పత్తి చేస్తుంది. అంటే 100గ్రాముల సబ్బు తయారు చేయడానికి 40కంటే ఎక్కువ నత్తల అవసరం ఉంది. పాశ్చాత్యదేశాల్లో తాము వాడే సౌందర్య సాధనాల్లో నత్తల జిగురును వాడడం చాలా సర్వ సాధారణం. యవ్వనంగా ఉంచే చర్మ సాధనాల్లో నత్తల జిగురును వాడుతుంటారు. ప్రస్తుతం డానియల్ డెస్రోచర్ వాటితోనే సబ్బులని తయారు చేసి సరికొత్త పద్దతిని మొదలు పెట్టాడు.

Read more RELATED
Recommended to you

Latest news