విపక్షం స్వపక్షం అందరికీ రేవంతే టార్గెట్ ?

-

ఎవరూ ఎదుర్కొని, ఎంతో క్లిష్టమైన పరిస్థితిని తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఎదుర్కొంటున్నారు. ఒకవైపు రాజకీయంగా బలమైన శత్రువులు గా ఉన్న అధికార పార్టీ టిఆర్ఎస్, ఇప్పుడిప్పుడే తెలంగాణాలో బలమైన పార్టీగా మారుతున్న బిజెపి స్పీడ్ ను తట్టుకుంటూ, కాంగ్రెస్ పార్టీకి తిరిగి పునర్వైభవం తీసుకువచ్చేందుకు రేవంత్ రెడ్డి గట్టిగానే కష్టపడుతున్నారు. ఎన్నో కేసులను, మరెన్నో రకాల ఒత్తిళ్లు, ఇబ్బందులను ఎదుర్కొంటూనే కాంగ్రెస్ కు విజయాన్ని అందించే దిశగా రేవంత్ పార్టీని ముందుకు తీసుకు వెళ్తున్నారు. అయితే ఇక్కడ బిజెపి, టిఆర్ఎస్ పార్టీల కంటే సొంత పార్టీ నాయకుల నుంచే రేవంత్ కు ఎక్కువ ఇబ్బందులు వచ్చిపడుతున్నాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తాను ఎన్ని విమర్శలు చేసినా, అది రాజకీయంగా తమ ప్రత్యర్థులకు బలం గా మారుతుందనే ఉద్దేశంతో రేవంత్ సైలెంట్ గా ఉంటున్నారు. ప్రస్తుతం పిసిసి అధ్యక్ష పదవిని భర్తీ చేసేందుకు కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు చేస్తోంది.

ఎక్కువగా రేవంత్ రెడ్డి పేరు ఎక్కువగా వినిపిస్తోంది. ఆ తరువాత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, బట్టి విక్రమార్క వంటి పేర్లు వినిపిస్తున్నాయి. కాకపోతే రేవంత్  వైపే అధిష్టానం మొగ్గు చూపుతోందనే వార్తలు అటు తెలంగాణ కాంగ్రెస్ సీనియర్లకు, ఇటు బిజెపి, టిఆర్ఎస్ పార్టీలకు ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా బిజెపి ఇప్పుడు రేవంత్ రెడ్డి ని పరోక్షంగా టార్గెట్ చేసేయాలని డిసైడ్ అయిపొయింది. ఆయనకు పదవి దక్కితే తమకూ ఇబ్బందే అనే ఉద్దేశంలో బీజేపీ ఉంది. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నాయకులపై బీజేపీ ఫోకస్ పెంచింది.  కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తాము బిజెపిలోకి వెళ్తున్నాను అంటూ తిరుమలలో సంచలన ప్రకటన చేశారు. ఇక రేవంత్ కు పిసిసి అధ్యక్ష పదవి కన్ఫామ్ కాగానే మరికొంత మంది సీనియర్ నాయకులు బీజేపీలోకి వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు.

ఇదిలా ఉండగా తాజాగా సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జగ్గారెడ్డి పార్టీ అధిష్టానానికి రాసిన లేఖ కలకలం సృష్టిస్తోంది. కాంగ్రెస్ పార్టీకి కావాల్సింది పులులు సింహాలు కాదని, అందరినీ కలుపుకుని పార్టీ వీర విధేయుడిగా ఉంటూ అందరినీ కలుపుకుపోయే నాయకత్వం కావాలి అంటూ రాహుల్, సోనియా గాంధీలకు లేఖ రాయడం సంచలనంగా మారింది. తెలంగాణ కాంగ్రెస్ సీనియర్లు అంతా పూర్తిగా రేవంత్ రెడ్డికి పదవి దక్కక పోతే చాలు, తమకు దక్కినా దక్కక పోయినా ఫర్వాలేదు అన్నట్లుగా వ్యవహరిస్తున్న తీరు కాంగ్రెస్ పార్టీకి తీరని నష్టం కనిపిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news