ఓట్లేసి గెలిపించిన కడప జిల్లా ప్రజలకు, రైతులను ముందు ఆదుకోండని టిడిపి మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జిల్లా ప్రజలు వైఎస్ఆర్ కు, జగన్ కు పట్టం గట్టారని, అభివృద్ధి పేరుతో రివర్స్ తో కుమ్మేస్తున్నారంటూ ఆయన సెటైర్లు వేశారు. మూడేళ్లలో కడపకు చేసింది గుండు సున్నా అని ఆయన ఎద్దేవా చేశారు. 3 ఏళ్లలో స్టీల్ ప్లాంట్ తెస్తానని.. గండికోట పైడిపాలెం లిఫ్ట్ కు 3500 కోట్లు , మైక్రో ఇరిగేషన్ కోసం ప్రత్యేక జీవో ఇచ్చినా ఏమీ చేశారు అని ఆయన ప్రశ్నించారు. ‘2018లో టీడీపీ చేసిన అభివృద్ధి కంటే వైసిపి చేసింది ఏమీలేదు.
రాయలసీమ సాగు నీటికి సంబంధించిన గాలేరు-నగారికి టీడీపీ 11వేల కోట్లు ఇస్తే వైసిపి ప్రభుత్వ కేవలం 11 వందల కొట్లు ఖర్చు చేసింది.. అన్నమయ్య, పించా ప్రాజెక్ట్ కొట్టుకు పోతే ఏడాదిగా గాలికి వదిలేశారు. సొంత జిల్లాను పట్టించు కొని వైఎస్ జగన్. ఇక రాష్ట్రానికి ఏమీ మేలు చేస్తారు.. సీపీఐ ఉక్కు పాదయాత్రకు టిడిపి మద్దతు. జిల్లాలో భూ ముల కొంభ కోణం, ఇసుక కుంభ కోణాలు పెరిగిపోయాయి..కడప జిల్లా అభివృద్ధి విషయంలో ఏ రంగంలో చూసినా వైసిపి కన్నా టిడిపి ఎక్కువే చేసింది..’ అని ఆయన వ్యాఖ్యానించారు.