సోము వీర్రాజు: ” టీడీపీ – చంద్రబాబు” డైరెక్షన్ లో మేము నడుస్తున్నామా ?

-

నిన్న బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ కార్ పై వైసీపీ కార్యకర్తలు దాడి జరిగిన విషయం తెలిసిందే. దీని పైన నిన్నటి నుండి టీడీపీ మరియు బీజేపీ నాయకులు తమ స్పందనను తెలియచేస్తున్నారు. తాజాగా ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఈ ఘటన పట్ల తన విచారాన్ని వ్యక్తం చేశాడు. ఈ దాడి జరగకుండా పోలీసులు తగిన జాగ్రత్తలు తీసుకుని ఉండాల్సింది అంటూ అభిప్రాయపడ్డారు. ఎవరైతే ఈ దాడికి కారణం అయ్యారో వారిపైన తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

 

 

ఇక వైసీపీ నేతలు కామెంట్ చేరినట్లుగా.. నేనేమీ టీడీపీ నాయకుడు చంద్రబాబు చెప్పిన విధంగా నడుచుకోవట్లేదని కౌంటర్ ఇచ్చాడు. నాకంటూ ఒక అజెండా ఉందని… బీజేపీ అధిష్టానం ఆదేశాల మేరకు పార్టీని ఏపీలో బలోపేతం చేస్తున్నామని సూటిగా చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news