ఈ రోజు ఉదయం తెలంగాణలోని బండి సంజయ్ కరీంనగరంలోని తన నివాసానికి పోలీసులు పెద్ద సంఖ్యలో వచ్చి అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. కరీంనగర్ లో పెద్ద ఎత్తున నిరసనలు రేగుతున్నాయి. ఇప్పటికే ఈ విషయం గురించి అటు బీజేపీ నాయకులు ఇటు BRS ఎమ్మెల్యేలు రెస్పాండ్ అవుతున్నారు. కాగా తాజాగా ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఈ అరెస్ట్ పై స్పందించాడు. ఈయన మాట్లాడుతూ బండి సంజయ్ అరెస్టును ఖండిస్తున్నానని చెప్పారు. సోము వీర్రాజు మాట్లాడుతూ ఈ విధంగా అకారణంగా సంజయ్ ను అరెస్ట్ చేయడం పిరికిపంద చేసే పనని ఫైర్ అయ్యాడు.
ఇంకా ఈయన మాట్లాడుతూ BRS చేసే తాటాకు చప్పుళ్లకు బీజేపీ భయపడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పాడు. ఇకనైనా తెలంగాణ ప్రజలు కళ్లుతెరవాలని కల్వకుంట్ల కుటుంబం చేతిలో మోసపోకుండా ఉండాలంటే వచ్చే ఎన్నికల్లో బీజేపీకి అందరూ ఓటేయాలని పిలుపునిచ్చారు. బండి సంజయ్ ను త్వరితగతిన విడుదల చేయాలని డిమాండ్ చేశారు.