భూమి కోసం తల్లిని నరికి.. తల చేత్తో పట్టుకుని..

-

ఆస్తి కోసం తల్లిని నరికి ఆమె తలను పట్టుకుని రోడ్లపై తిరుగుతు స్థానికులను భయపెట్టాడు ఓ వ్యక్తి. ఈ దారుణ ఘటన జనగామ మండలం మరిగడిలో గురువారం చోటుచేసుకుంది. అసలేం జరిగిందంటే..

కానిస్టేబుల్-దారుణ హత్య

మరిగడికి చెందిన కూరాకుల రమణమ్మ(65)కు కుమారుడు కన్నప్ప, కూతురు లావణ్య ఉన్నారు. పదేళ్ల కిందట రమణమ్మ భర్త రాజయ్య మృతి చెందారు. వివాహిత కుమార్తె భర్తతో విభేదాల కారణంగా తల్లి దగ్గరే ఉంటోంది. కన్నప్పకు కూడా వివాహమై.. భార్య, కుమార్తెతో జీవిస్తున్నాడు.

రమణమ్మ పేరిట 10 ఎకరాల వ్యవసాయ భూమి ఉండగా.. కుమారుడికి రెండు, కుమార్తెకు నాలుగు ఎకరాలు రాసిచ్చింది. మరో రెండు ఎకరాలు కూడా తనకివ్వాలని కన్నప్ప పలుమార్లు కోరాడు. అయినా వినడం లేదన్న కోపంతో ఇటీవల తల్లి తలను గోడకేసి కొట్టాడు. గాయపడిన ఆమె.. కుమారుడిపై కేసు పెట్టింది.

దీంతో కన్నప్ప రెండు రోజుల కిందట ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. కుటుంబసభ్యులు అతడిని జనగామ ప్రభుత్వాసుపత్రిలో చేర్చగా.. చికిత్స పొంది గురువారం ఉదయం ఇంటికి వచ్చాడు. రాగానే కత్తితో తల్లి మెడపై అతి కిరాతకంగా నరకడంతో ఆమె నేలకూలింది. తల, మొండెం వేరై.. రక్తం మడుగు కట్టింది. కన్నప్ప తల్లి తలను చేత పట్టుకొని కాసేపు పరిసరాల్లో తిరుగుతూ.. స్థానికులను భయాందోళనలకు గురిచేశాడు. తర్వాత జనగామ పోలీస్‌ స్టేషన్‌లో లొంగిపోయాడని జనగామ సీఐ ఎల్లబోయిన శ్రీనివాస్‌ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news