బాలకృష్ణ సినిమాలో సోనాక్షి సిన్హా..!

-

అనిల్ రావిపూడి దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నటిస్తోన్న 108వ సినిమా ఇప్పటికే ఖరారైంది. హైఓల్టేజ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందనున్న ఈ సినిమాలో బాలకృష్ణ కూతురిగా పెళ్లిసందD ఫేమ్ శ్రీలీల నటిస్తుండగా మరో కీలక పాత్ర కోసం బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా నటించనున్నట్లు సమాచారం. ఈ పాత్ర కోసం త్వరలోనే ఆమెను సంప్రదించాలని చూస్తున్నారట అనిల్ రావిపూడి.


ఈ పాత్ర కోసం ప్రియమణి పేరు పరిశీలిస్తున్నట్లు గతంలో వార్తలొచ్చాయి. కానీ, ఇప్పుడీ పాత్రకు చిత్ర బృందం సోనాక్షిని తీసుకోవాలన్న ఆలోచనలో ఉంది. త్వరలో ఆమెకు కథ వినిపించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం సోనాక్షి సిన్హా నటించిన ‘డబుల్‌ ఎక్స్‌ఎల్‌’ విడుదలకు సిద్ధమవుతోంది.


కాగా, బాలయ్య ప్రస్తుతం గోపిచంద్​ మలినేని దర్శకత్వంలో ‘ఎన్​బీకే 107’లో నటిస్తున్నారు. ప్రస్తుతం కర్నూల్ సహా అక్కడి పరిసర ప్రాంతాల్లో శరవేగంగా షూటింగ్​ జరుపుకుంటోంది. శ్రుతిహాసనే హీరోయిన్​. కన్నడ స్టార్​ దునియా విజయ్​కుమార్​ ప్రతినాయకుడిగా కనిపిస్తుండగా, వరలక్ష్మీ శరత్​కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు. మైత్రీమూవీ మేకర్స్​ నిర్మిస్తోంది. తమన్​ సంగీతం అదిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news