Dhamki : విశ్వక్‌సేన్ ధమ్‌కీ నుంచి ‘మావా బ్రో’ సాంగ్‌

-

మాస్ కా దాస్ విశ్వక్సేన్ లేటెస్ట్ మూవీ ‘దాస్ కా ధమీ’ నుంచి ‘మావా బ్రో’ లిరికల్ వీడియో విడుదలైంది. కాసర్ల శ్యాం రాసిన ఈ పాటను రామ్ మిరియాల పాడి, మ్యూజిక్ అందించాడు. కాగా కరాటే రాజు నిర్మిస్తున్న ఈ సినిమాను విశ్వక్‌సేన్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ చిత్రంలో నివేథా పేతురాజ్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలకి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ట్రైలర్, ఫస్ట్ సింగిల్ కి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ చిత్రం నుండి రెండవ సింగిల్ ను చిత్ర యూనిట్ విడుదల చేయడం జరిగింది.

ఈ మావా బ్రో సాంగ్ ఫన్ అండ్ ఎంటర్టైనింగ్ గా సాగింది. ఈ పాటకి కాసర్ల శ్యామ్ లిరిక్స్ రాయగా, రామ్ మిరియాల పాడటం జరిగింది. రావు రమేష్, తరుణ్ భాస్కర్, అక్షర గౌడ, అజయ్, పృధ్వీ రాజ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి లియోన్ జేమ్స్ సంగీతం అందించారు. విశ్వక్ సేన్ నటిస్తున్న ఈ చిత్రం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Read more RELATED
Recommended to you

Latest news