సోనియా గాంధీ నివాసంలో కాంగ్రెస్ పార్లమెంటరీ స్ట్రాటజీ గ్రూప్ మీటింగ్

-

రేపటి నుంచి ప్రారంభం అయ్యే పార్లమెంట్ రెండో విడత సమావేశాల కోసం కాంగ్రెస్ పార్టీ సిద్ధం అవుతోంది. దీనికి సంబంధించి ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేయనున్నారు. అధికార బీజేపీ పార్టీని ఎలా ఎదర్కోవాలనే దానిపై చర్చించనున్నారు. దీని కోసం సోనియా గాంధీ నివాసంలో ఉదయం 10 గంటలకు కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ స్ట్రాటజీ గ్రాప్ సమావేశం అయింది. కాంగ్రెస్ పార్లమెంటరీ స్ట్రాటజీ గ్రూప్ సమావేశానికి కాంగ్రెస్ నేతలు మల్లికార్జున్ ఖర్గే, ఆనంద్ శర్మ, కె సురేష్, జైరాం రమేష్ లు 10 జన్ పథ్ చేరుకున్నారు. దీంతో పాటు ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో విజయంతో బీజేపీ, ప్రతిపక్షాలపై విరుచుకుపడే అవకాశం ఉంది. ఈమేరకు బీజేపీని అడ్డుకునేందుకు కార్యాచరణ రూపొందించే పనిలో ఉంది కాంగ్రెస్.

ఇదిలా ఉంటే సోనియాగాంధీ అధ్యక్షతన ఈరోజు సాయంత్రం 4 గంటలకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ( సీడబ్య్లూసీ) మీటింగ్ జరగనుంది. 5 రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం గురించి ఈ సమావేశంలో చర్చించనున్నారు. దీంతో పాటు కాంగ్రెస్ నాయకత్వంలో మార్పు గురించి కూడా చర్చించే అవకాశం ఉంది. మరోవైపు కాంగ్రెస్ పదవులకు సోనిమా, రాహుల్, ప్రియాంకలు రాజీనామా చేస్తారనే.. వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news