ఈ నెల 21న ఈడీ ముందుకు సోనియా గాంధీ..

-

కాంగ్రెస్ పార్టీ గ‌తంలో న‌డిపిన ప‌త్రిక నేష‌న‌ల్ హెరాల్డ్ ఆస్తుల వ్య‌వ‌హారానికి సంబంధించిన కేసులో త‌మ ముందు జులై 21నవిచార‌ణ‌కు హాజ‌రుకావాలంటూ సోనియాకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) స‌మ‌న్లు జారీ చేసిన సంగ‌తి తెలిసిందే. ఈడీ స‌మ‌న్ల మేర‌కు సోనియా గాంధీ గురువారం విచార‌ణ‌కు హాజ‌ర‌వుతార‌ని కాంగ్రెస్ వ‌ర్గాలు తెలిపాయి. గ‌తంలోనే విచార‌ణ‌కు రావాలంటూ ఈడీ జారీ చేసిన స‌మ‌న్ల‌కు స్పందించిన సోనియా… అనారోగ్య కార‌ణాల వ‌ల్ల ఇప్ప‌టికిప్పుడు విచార‌ణ‌కు హాజ‌రు కాలేన‌ని, 3 వారాల త‌ర్వాత విచార‌ణ‌కు హాజ‌ర‌వుతాన‌ని తెలిపిన సంగ‌తి తెలిసిందే.

Karnataka Cong to mark Sonia Gandhi's deposition before ED with large scale  stir | Bengaluru - Hindustan Times

సోనియా విజ్ఞ‌ప్తికి సానుకూలంగా స్పందించిన ఈడీ అధికారులు ఈ నెల 21 విచార‌ణ‌కు హాజ‌రుకావాలంటూ ఇటీవ‌లే నోటీసులు జారీ చేశారు. ఈ క్ర‌మంలోనే గురువారం సోనియా గాంధీ ఈడీ విచార‌ణ‌కు హాజ‌రుకానున్నారు. ఈ కేసులో ఇప్ప‌టికే ఈడీ అధికారులు 5 రోజుల పాటు రాహుల్ గాంధీని విచారించిన సంగ‌తి తెలిసిందే.

 

Read more RELATED
Recommended to you

Latest news