హాస్పిట్‌ల్ నుంచి గంగూలీ డిశ్చార్జ్.. మరికొంతకాలం హోంఐసోలేషన్

-

బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా(బీసీసీఐ) చైర్మన్ సౌరవ్ గంగూలీ శుక్రవారం హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆయన నమూనాలు జినోమ్ సీక్వెన్సింగ్‌కు పంపించగా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ నెగెటివ్ వచ్చింది. గంగూలీ ఆరోగ్యం నిలకడగా ఉన్నదని, హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అనంతరం హోం ఐసోలేషన్‌లో ఉండనున్నట్లు వుడ్‌ల్యాండ్ హాస్పిటల్ వైద్యులు తెలిపారు.

బీసీసీఐ చైర్మన్ సౌరవ్ గంగూలీకి స్వల్ప లక్షణాలు ఉండటంతో హాస్పిటల్‌కు తరలించి వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందించారు. సోమవారం రాత్రి గంగూలీకి మోనోక్లోనల్ యాంటీబాడీ కాక్‌టెయిల్ థెరపీని అందించారు.

గత ఏడాది కాలంలో సౌరవ్ గంగూలీ మూడుసార్లు హాస్పిటల్‌ అడ్మిట్ అయ్యారు. ఛాతిలో నొప్పి కారణంగా రెండుసార్లు హాస్పిటల్‌లో చేరారు. కోల్‌కతాలోని ఇంటిలో వ్యాయామం చేస్తుండగా గుండెనొప్పికి గురయ్యారు. ఆయనకు కరోనారీ అంజియోప్లాస్టీ చికిత్స అందించారు.

Read more RELATED
Recommended to you

Latest news