T20 World Cup: నెదర్లాండ్స్ గ్రాండ్‌ విక్టరీ..ప్రపంచ కప్‌ నుంచి సౌతాఫ్రికా ఔట్‌

-

టీ20 వరల్డ్‌కప్‌ నుంచి సౌతాఫ్రికా నిష్ర్కమించింది. టీ20 వరల్డ్‌కప్‌ లో మరో సంచలన విజయం నమోదు అయింది. సౌత్ ఆఫ్రికా తో ఇవాళ జరిగిన మ్యాచ్లో పసికూన జట్టు అయిన నెదర్లాండ్స్ చరిత్ర సృష్టించింది.

తొలుత బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్ నాలుగు వికెట్ల నష్టానికి ఏకంగా 158 పరుగులు చేసింది. అయితే.. చేధనలో సౌత్ ఆఫ్రికా ఎనిమిది వికెట్లు కోల్పోయి కేవలం 145 రన్స్ మాత్రమే చేయగలిగింది. సౌతాఫ్రికాపై 13 పరుగుల తేడాతో నెదర్లాండ్స్‌ విజయం సాధించింది. ఈ ఫలితంతో.. టీమిండియాకు ఖరారైన సెమీస్‌ బెర్త్‌ ఫైనల్‌ అయింది. అటు టీ20 వరల్డ్‌కప్‌ నుంచి సౌతాఫ్రికా నిష్ర్కమించింది.

Read more RELATED
Recommended to you

Latest news