ఉత్కంఠగా సాగిన మ్యాచ్ లో ఆఖరి బంతికి దక్షిణాఫ్రికా భారత మహిళా జట్టు పై విజయాన్ని సాధించింది. ప్రపంచ కప్ లో తన చివరి లీగ్ మ్యాచ్ లో దక్షిణాఫ్రికాతో ఆడుతున్న భారత మహిళా జట్టు ఒత్తిడితో పరాజయం పాలైంది. సెమీ ఫైనల్ కి చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో భారత మహిళా క్రికెట్ జట్టు సమిష్టిగా రాణించిన విజయాన్ని చేరుకోలేకపోయింది.
ఫలితంగా సెమిస్ కు చేరకుండానే ప్రపంచకప్ లో ప్రయాణం ముగించింది.తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 274 పరుగులు చేసింది. భారత్ బ్యాటింగ్: కెప్టెన్ మిథాలీ రాజ్ 68, స్మృతి మందాన 71, షేఫాలి వర్మ 53, హర్మన్ ప్రీత్ కౌర్ 48 పరుగులతో రాణించారు. అనంతరం బ్యాటింగ్ కి దిగిన దక్షిణాఫ్రికా జట్టు 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 275 పరుగులు చేసి లక్ష్యాన్ని సాధించింది. దక్షిణాఫ్రికా బ్యాటింగ్: లారా వొల్వార్డ్ 80, లారా గుడాల్ 49, కెప్టెన్ సూన్ లూస్ 22, మరిజాన్నే 32 పరుగులు చేశారు. ఇక మిగ్నాన్ డు ప్రీజ్ జట్టు విజయం కోసం పోరాడింది. లోయర్ ఆర్డర్ తో కలిసి 63 బంతుల్లో 52 పరుగులు చేసి జట్టుకు విజయాన్ని కట్టబెట్టింది.ఆఖరి ఓవర్ వరకు మ్యాచ్ ఉత్కంఠగా సాగింది. ఐదో బంతిని దీప్తి శర్మ నో బాల్ గా వేయడం చివరి బంతికి డూ ప్రీజ్ సింగిల్ తీయడంతో దక్షిణాఫ్రికా విజయం సాధించింది.