అవును – 60.7 %
కాదు – 39.3 %
ట్రిపుల్ ఆర్ సినిమాకు సంబంధించి ఎన్నో సంచనాలు నమోదు అవుతూనే ఉన్నాయి. మిశ్రమ ఫలితాలను అందుకున్నా కూడా సినిమా కలెక్షన్ల పరంగా స్టామినా చూపిస్తోంది. ఇదే సందర్భంలో బడ్జెట్ విషయమై రాజమౌళి చెప్పిన కాకమ్మ కబుర్లు మాత్రం అస్సలు నమ్మకం కలిగించే విధంగా లేవని నెటిజన్లు అదే పనిగా ఈ ఇష్యూ పై పుంఖానుపుంఖాలుగా పోస్టులు రాస్తున్నారు. ట్రిపుల్ ఆర్ సినిమాను అదే పనిగా ట్రోల్ చేస్తున్నారు. అదేవిధంగా ఈ సినిమా నిర్మించేందుకు నాలుగేళ్ల గడువు లేదా ఐదేళ్ల కాలం కావాల్సి వచ్చిందా అని కూడా గగ్గోలు పెడుతున్నారు.
అందుకే ఆర్జీవీ లాంటి వారిని చూసి నేర్చుకోమనేది అని సెటైర్లు వేస్తున్నారు. ట్రిపుల్ ఆర్ కన్నా తమకు డీజే టిల్లు నచ్చిందని, అసలు ఆ సినిమాకు అంత ఖర్చు ఎందుకని కేవలం ప్రేక్షకుల జేబులు కొల్లగొట్టేందుకే బడ్జెట్ ఎక్కువ చేసి చూపిస్తున్నారని ప్రేక్షకులలో కొందరు మండి పడుతున్నారు.ఈ నేపథ్యంలో మరో ఆసక్తికర పరిణామం కూడా చోటుచేసుకుంది.అదే టికెటింగ్ వ్యవహారం.
వాస్తవానికి సినిమా టికెట్ ధరలు తగ్గిస్తూ జీఓ ఒకటి ఇష్యూ చేశారు సీఎం జగన్. దీనిపై అభ్యంతరాలు నెలకొన్నాయి. అదేవిధంగా చాలా థియేటర్లు మూతకు నోచుకున్నాయి.ఈ దశలో చిరు జోక్యం చేసుకుని ఏపీ సీఎం పెద్ద మనసుతో ఇండస్ట్రీ సమస్యలు అర్థం చేసుకోవాలని చేతులు జోడించి వేడుకున్నారు.దీంతో సవరించిన జీఓను విడుదల చేసి అందరికీ ఆమోదం అనుకునే విధంగా జగన్ ఓ నిర్ణయం వెలువరించారు. ఇది కూడా సమ్మతి కాని నేపథ్యంలో ఆర్ఆర్ఆర్ చిత్ర దర్శకుడు రాజమౌళి వెళ్లి మళ్లీ టికెట్ రేట్లు సవరించేలా అదేవిధగా ఐదో షోకు అనుమతి పొందేలా చేసుకున్నారు.
ఇప్పుడు శ్రీకాకుళం ఎస్వీసీ థియేటర్ లో టికెట్ రేటు గరిష్టంగా 234 రూపాయలు.. జిల్లా కేంద్రంలో అన్ని థియేటర్లలోనూ ఇదే రేటు ఉంది. అయినా కూడా కొన్ని చోట్ల టికెట్లు బ్లాకులోనే అమ్ముడవుతున్నాయి కానీ కౌంటర్ సేల్స్ లేవు.ఈ నేపథ్యంలో వైసీపీ శ్రేణులు కూడా ఇందులో ఇన్వాల్స్ అయి ఉన్నారు అన్న వాదనలు కూడా ఉన్నాయి. ఆ రోజు బాహుబలి సమయంలో టీడీపీ పెద్దలు లబ్ధి పొందారన్న వార్తలు గుప్పు మన్నాయి.ఇప్పుడు వైసీపీ పెద్దలు అదే విధంగా భారీ స్థాయిలో లాభాలు పొందారు అని కూడా సమాచారం. గతంతో పోలిస్తే ఇవాళ వైసీపీ నాయకుల దగ్గరే థియేటర్లు కూడా ఎక్కువ ఉన్నాయి. వీటితో పాటు కొంత మొత్తం వైసీపీ పెద్దలకు అందించి మరీ !
థియేటర్లు తమకు నచ్చిన విధంగా బ్లాకు మార్కెట్ లో టికెట్లు అమ్ముకునేందుకు సిద్ధం అయ్యాయని ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఇంత జరిగినా కూడా రెవెన్యూ మరియు పోలీసు యంత్రాంగం స్పందించిన దాఖలాలు లేవు. ఈ నేపథ్యాన ఆ రోజు బాహుబలి సమయంలో చాలా వినోదపు పన్ను ఎగవేత చేశారని మండిపడ్డ సజ్జల రామకృష్ణా రెడ్డి లాంటి పెద్దలు ఇప్పుడు ఎందుకు మాట్లాడడం లేదు అన్న సందేహాలు కూడా వస్తున్నాయి. అంటే వైసీపీ పెద్దలకు, ఆర్ఆర్ఆర్ డిస్ట్రిబ్యూటర్లకు, ఎగ్జిబిటర్లకు మంచి ఒప్పందాలే జరిగాయి అన్న డౌట్ కూడా టీడీపీ నుంచి వస్తోంది. అందుకే శోభు యార్లగడ్డలాంటి ప్రొడ్యూసర్లు వినోదపు పన్ను ఆ రోజు ఎగవేత చేసినా ఇప్పుడు కలెక్షన్ డాటా సరిగాచూపించక దానయ్య వినోదపు పన్ను ఎగవేత చేసినా లాభ పడేది నాయకులు నష్టపోయేది ప్రేక్షకులు అని తేలిపోయిందని ప్రజా సంఘాలు గగ్గోలు పెడుతున్నాయి.
ఆర్ఆర్ఆర్ లాభాల్లో వైసీపీకి వాటాలు నిజమేనా ?#RRRMovie #RRRBlockbuster #RamCharan𓃵 #NTR𓃵 #SSRajamouli
— Manalokam (@manalokamsocial) March 26, 2022
– ట్విటర్ పోల్ – మన లోకం ప్రత్యేకం