భారత్‌లో కరోనా మహహ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. రోజురోజుకు లక్షల్లో పాజిటివ్ కేసులు, వేలల్లో మరణాలు సంభవిస్తున్నాయి. దీంతో భారత్‌లో పరిస్థితి దారుణంగా తయారైంది. గత సంవత్సరం కంటే ఈ ఏడాది కరోనా తీవ్రంగా వ్యాప్తి చెందుతోంది. ఆక్సిజన్ కొరత కూడా తీవ్రంగా ఉంది. దీంతో పలు దేశాలు భారత్‌ను ఆర్థికంగా ఆదుకుంటున్నాయి.
తాజాగా భారత్ కి సహాయపడటానికి ఆక్సిజన్ సిలిండర్ల, కోవిడ్ -19 డయాగ్నొస్టిక్ కిట్లు మరియు ఇతర సహాయ వస్తువులు భారతదేశానికి అందిస్తామని దక్షిణ కొరియా తెలిపింది. భారతదేశం నుండి దక్షిణ కొరియా పౌరులను తిరిగి తీసుకురావడానికి కూడా ప్రభుత్వం విమానాలను అనుమతిస్తుందని ఆరోగ్య అధికారి యూన్ తైహో బుధవారం చెప్పారు. తిరిగి వచ్చే వారు మూడు సార్లు వైరస్ పరీక్షలు చేయించుకుంటారని మరియు నిర్బంధంలో ఉంచబడతారని ఆయన చెప్పారు. దక్షిణ కొరియా భారతదేశానికి పంపే సహాయ వస్తువుల గురించి యూన్ వివరించలేదు.