సోయాకట్లెట్.. బాలింతలకు బెస్ట్ స్నాక్ ఐటమ్..! ఇలా చేసేయండి..!

-

బిడ్డ పుట్టిన తర్వాత.. బాలింతలకు టేస్టీగా ఉండేవి ఏదో ఒకటి తినాలనిపిస్తుంది.. అలా అని ఏది పడితే అది తింటే..ఆ టైంలో ఆరోగ్యానికి మంచిది కాదు. బిడ్డకు ప్రమాదం.. తల్లికి జ్వరమోస్తే.. బిడ్డకు కూడా వచ్చేస్తుంది. కాబట్టి.. ఆ టైంలో ఇద్దరి ఆరోగ్యం చాలా ముఖ్యం. బాలింతలు పాలు పెరగడానికి చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. అలాగే.. టేస్ట్ తో పాటు.. హెల్త్ కు కూడా మేలు చేసే సోయా కట్లెట్స్ రోజుకు రెండు తింటే చాలు.. బాలింతలకు సరిపడా పాలు అందుతాయి. ఈరోజు మనం ఇవి ఎలా చేయాలో చూద్దాం.

సోయా కట్లెట్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు

ఉడకపెట్టిన సోయా ఒకటిన్నర కప్పు
పెరుగు అరకప్పు
టమోటా ముక్కలు అరకప్పు
క్యారెట్ తురుము రెండు టేబుల్ స్పూన్స్
పుదినా తురము రెండు టేబుల్ స్పూన్స్
పుట్నాలు పిం‍డి రెంటు టేబుల్ స్పూన్స్
పచ్చిమిర్చి ముక్కలు ఒక టేబుల్ స్పూన్
లెమన్ జ్యూస్ ఒక టేబుల్ స్పూన్
మీగడ ఒక టేబుల్ స్పూన్
వాము ఒక టీ స్పూన్
జీలకర్ర పొడి ఒక టీ స్పూన్
మిరయాల పొడి ఒక టీ స్పూన్
పసుపు కొద్దిగా
కొత్తిమీర కొద్దిగా

తయారు చేసే విధానం..

సోయా ఉడకపెట్టి వాటిని మిక్సీ జార్ వేసి పేస్ట్ లా చేసుకోవాలి. దాన్ని ఒక బౌల్ లో తీసుకుని అందులో పుట్నాలపప్పు పొడి, శనగపిండి, క్యారెట్ తురుము, పుదీనా, టమోటా ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర, వాము, జీలకర్ర పొడి, మిరయాల పొడి, పసుపు, లెమన్ జ్యూస్, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. అలా కలిపిన తర్వాత గారెలు చేసినట్లు చేసుకుని నానస్టిక్ ప్యాన్ పై వేసి మెల్లగా కాలనివ్వాలి. ఇలా రెండు వైపులా కాలనిచ్చి తీసేస్తే చాలు.. హెల్తీ అయిన సోయా కట్లెట్ రెడి. వీటిని బాలింతలే కాదు.. మనం కూడా అప్పుడప్పుడు తింటుంటే.. మహిళల్లో ఉండే పిరియడ్ పెయిన్స్ ఉండవు. జుట్టుకు సోయా చాలా మంచిది. హెయిర్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్లు సోయాను డైలీ ఏదో ఒక రూపంలో వాడుకుంటే చాలా మంచిది.

Read more RELATED
Recommended to you

Latest news