మహేశ్‌ అభిమానులారా.. సిద్ధం కండి.. రేపే విడుదల..

-

పరుశురామ్ పెట్ల దర్శకత్వంలో టాలీవుడ్‌ సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న చిత్రం ‘సర్కారువారి పాట’. ఈ సినిమా మే 12 న రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడడంతో మేకర్స్ ప్రమోషన్స్ వేగవంతం చేశారు. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్స్‌ను వేగవంతం చేశారు మేకర్స్. మరో పక్క సోషల్ మీడియా లో కూడా జోరు పెంచిన మేకర్స్ ట్రైలర్ డేట్ ని ఫిక్స్ చేస్తూ.. ప్రేక్షకుల్లో సినిమాపై అంచనాలను పెంచేస్తున్నారు. తాజాగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు సంబంధించిన అప్డేట్ ను అందించాారు. ఈ ఈవెంట్ ను హైదరాబాద్ లోని మాస్ థియేటర్ భ్రమరాంబ 70 ఎంఎం వద్ద నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ఈవెంట్ ప్రారంభం కానున్నట్టు మేకర్స్ అఫిషియల్ గా వెల్లడించారు.

Sarkaru Vaari Paata Birthday Blaster | Mahesh Babu | Keerthy Suresh | Parasuram | Latest Telugu Movie Videosఅయితే ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమాకు లీక్ ల సమస్యలు ఎదురవుతున్నాయి. ప్రతి బిగ్ అనౌన్స్ మెంట్ ను అప్సెట్ చేస్తూ కొందరు ఆ అప్డేట్స్ ను ముందుగానే లీక్ చేస్తున్నారు. ఈసారి కూడా ట్రైలర్ లోని ఓ షార్ట్ ను లీక్ చేశారు. దీంతో సోషల్ మీడియాలో ఆ వీడియో వైరల్ అయ్యింది. కాగా, ఈ డ్యామేజ్ ను కవర్ చేసేందుకు సర్కారు వారి పాట టీం ట్రైలర్ కు సంబంధించిన మరో అప్డేట్ ను కూడా అందించింది. చిత్రంలో మహేశ్ బాబుకు సంబంధించిన మెంటర్ మాస్ స్వాగ్ తో కూడిన 105 షార్ట్స్ గల ట్రైలర్ ను లాంచ్ చేయనున్నట్టు తెలిపారు. రేపు సాయంత్రం 4:05 నిమిషాలకు ఈ ట్రైలర్ లాంచ్ కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news