జగ్గారెడ్డి అరెస్ట్‌ రాజ్యాంగ విరుద్ధం : భట్టి విక్రమార్క

-

ఓయూ ముట్టడి ఘటనలో అరెస్టైన NSUI విద్యార్థులను పరామర్శించడానికి వెళ్లిన కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డిని అరెస్ట్‌ చేయడం రాజ్యాంగ విరుద్ధమన్నారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. పరామర్శ చేయడం కూడా నేరం అయినట్టుగా పోలీసులు వ్యవహరించడం దుర్మార్గమన్నారు. రాజ్యాంగం ద్వారా సంకల్పించిన వాక్ స్వాతంత్రాన్ని తెలంగాణ ప్రభుత్వం హరిస్తుందని, ప్రజల రక్షణ కోసం పని చేయాల్సిన పోలీసులు పాలకుల మెప్పు కోసం పని చేస్తున్నారని భట్టి మండిపడ్డారు. జగ్గారెడ్డిని అప్రజాస్వామికంగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు ప్రకారంగా ఓయు విద్యార్థులు చేసిన నిరసన కార్యక్రమాన్ని పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి అడ్డుకోవడం తగదన్నారు.

Bhatti Vikramarka as Congress floor leader

అరెస్టు చేసిన విద్యార్థులను జగ్గారెడ్డికి బేషరతుగా క్షమాపణ చెప్పి పోలీసులు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు భట్టి విక్రమార్క. ప్రత్యేక రాష్ట్రం కోసం పన్నెండు వందల మంది విద్యార్థుల బలిదానాలను చూసి చలించిపోయిన కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అమరవీరుల ఆశయాలు నెరవేర్చడానికి తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందన్నారు. దశాబ్దాల కలను నెరవేర్చిన సోనియాగాంధీకి కృతజ్ఞతా భావంతో ఉండాలన్న విషయాన్ని విస్మరించి సోనియా తనయుడు రాహుల్ గాంధీ ఓయూలో పర్యటించడానికి అనుమతి ఇవ్వకపోవడం దుర్మార్గమన్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news