ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు తాజాగా నిర్వహించిన పరీక్షల్లో కరోనా నెగెటివ్ వచ్చిందని, ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందంటూ పలు వార్తలు పుట్టుకొచ్చాయి. దీనిపై స్పందించిన చరణ్ అవన్నీ అవాస్తవం అని అన్నారు. నాన్న ప్రస్తుతం వెంటిలేటర్‌పైనే ఉన్నారు. ఆరోగ్యం కొంత నిలకడగానే ఉంది. నాన్న ఆరోగ్యం గురించి నేనే ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ ఇస్తాను పుకార్లు నమ్మోద్దంటూ చరణ్ కోరారు.
My dad is still on life support, kindly refrain from rumour mongering, says #SPCharan addressing the news of #SPBalasubrahmanyam testing negative for #Covid19 pic.twitter.com/VczMSCg1ar
— Hyderabad Times (@HydTimes) August 24, 2020
ఈ మేరకు ఆయన ఓ వీడియో మెసేజ్‌ను రిలీజ్ చేశారు. బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యానికి సంబంధించిన ఏ విషయమైనా ముందుగా తనకే తెలుస్తుందని, తానే స్వయంగా అప్‌డేట్ ఇస్తానని, అనవసరంగా పుకార్లను నమ్మవద్దని ఆయన కోరారు. కాగా, ఎంతో మంది ప్రముఖులు, సామాన్యులు బాలసుబ్రహ్యణ్యం ఆరోగ్యంపై స్పందించారు. ఆయన త్వరగా కొలుకోవాలని ఆకాంక్షించారు.