21 రోజుల ఐసొలేషన్‌.. మంకీపాక్స్‌ బాధితులకు కేంద్రం మార్గదర్శకాలు

-

ఇప్పటికే కరోనాతో సతమతమవుతున్న ప్రజలపై మంకీపాక్స్‌ రూపంలో మరో వైరస్‌ విజృంభిస్తోంది. అయితే మంకీపాక్స్‌ బాధితులకు 21 రోజుల ఐసొలేషన్‌ తప్పనిసరి అని కేంద్రం వెల్లడించింది. దేశంలో ఇప్పటివరకు నాలుగు కేసులు నమోదవగా, పలుచోట్ల అనుమానిత కేసులు వెలుగులోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం బుధవారం వైరస్‌బారిన పడినవారు, అనుమానితులు, వారి సంబంధీకులకు సంబంధించి మార్గదర్శకాలను విడుదల చేసింది కేంద్రం. మూడు పొరల మాస్కును తప్పనిసరిగా ధరించాలని, చేతులను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించింది కేంద్రం.

Haryana professor shows symptoms of Monkeypox, isolated at home after  returning from Kerala | Cities News,The Indian Express

మంకీపాక్స్‌ వైరస్‌ కారణంగా శరీరంపై ఏర్పడే పుండ్లు, గాయాలు తగ్గేవరకు నిరంతరం దుస్తులతో కప్పి ఉంచుకోవాలని తెలిపింది కేంద్రం. ఇదిలా ఉంటే.. శృంగారంతోనే కాకుండా.. మంకీపాక్స్ ఉన్న వారి వస్తువులను వాడటం.. వారితో ఉండటం.. వారితో లైంగిక సంబంధాలు పెట్టుకోవడం వలన మంకీపాక్స్‌ వ్యాప్తి చెందుతుందని తాజాగా డబ్ల్యూహెచ్‌వో వెల్లడించింది.

Read more RELATED
Recommended to you

Latest news