తెలంగాణ రాజకీయాల్లో ఈటల రాజేందర్ కంటూ ఓ ప్రత్యేకమైన స్థానం ఉన్న విషయం తెలిసిందే. తెలంగాణ కోసం గట్టిగా కొట్లాడిన నాయకుడు…అలాగే దాదాపు రెండు దశాబ్దాల పైనుంచి కేసీఆర్‌కు సపోర్ట్‌గా ఉంటూ..టీఆర్ఎస్ పార్టీ కోసం పనిచేశారు. సరే టీఆర్ఎస్‌లో ఉండగా ఈటలకు ఎంత ఫాలోయింగ్ ఉందో అందరికీ తెలిసిందే. అయితే టీఆర్ఎస్‌లో ఉండగా ఎక్కువ ఫాలోయింగ్ ఉందా? ఆ పార్టీ నుంచి బయటకొచ్చాక ఎక్కువ ఫాలోయింగ్ ఉందా? అంటే ఖచ్చితంగా టీఆర్ఎస్ నుంచి బయటకొచ్చాకే ఈటలకు ఫాలోయింగ్ బాగా పెరిగిందని చెప్పొచ్చు.
అయితే ఆ ఫాలోయింగ్ రావడానికి కారణం కేసీఆర్ అని మొహమాటం లేకుండా చెప్పొచ్చు. భవిష్యత్‌లో ఈటల తనకు పోటీ రావొచ్చని, తన తనయుడు కేటీఆర్ పట్టాభిషేకానికి ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో ఆయనని ఎలా పార్టీ నుంచి సైడ్ చేశారో అందరికీ తెలిసిందే. పార్టీ నుంచి బయటకొచ్చాక ఈటలా క్రేజ్ ఎలా పెరిగిందో అందరికీ తెలిసిందే. హుజూరాబాద్‌లో మళ్ళీ గెలిచి కేసీఆర్ అహంకారానికి చెక్ పెట్టారు.
ఇక ఇప్పుడు బీజేపీలో తిరుగులేని నాయకుడుగా ముందుకెళుతున్నారు. ఇదంతా కేసీఆర్ వల్లే జరిగిందని చెప్పొచ్చు. ఇప్పుడు అదే అంశం కేసీఆర్‌కు పెద్ద తలనొప్పిగా మారింది. పార్టీలో ఉంటూ పార్టీకే డ్యామేజ్ చేసే నాయకులని సైడ్ చేయడంలో కూడా కేసీఆర్ ముందుకెళ్లలేకపోతున్నారు. ఉదాహరణకు ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఖమ్మం, కరీంనగర్, మెదక్ లాంటి జిల్లాల్లో కొందరు టీఆర్ఎస్ నేతలు క్రాస్ ఓటింగ్ జరిగేలా చేశారు.
గెలవడానికి గెలిచారు గానీ…ప్రత్యర్ధి పార్టీ అభ్యర్ధులకు ఎక్కువ ఓట్లు పడటానికి కారణం మాత్రం టీఆర్ఎస్‌లో ఉన్న కొందరు నాయకులు అని చెప్పొచ్చు. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో కారుకు గట్టిగానే వెన్నుపోట్లు పొడిచారు. దీంతో టీఆర్ఎస్‌కు ఓట్లు తక్కువ పడ్డాయి. ఓట్లు ఎవరి వల్ల తక్కువ పడ్డాయో అందరికీ తెలుసు. కానీ అలాంటి నేతలని టీఆర్ఎస్ నుంచి బయటకు పంపించలేకపోతున్నారు. అలా బయటకు పంపితే మళ్ళీ అనవసరంగా వాళ్ళకు హైప్ ఇచ్చినట్లు అవుతుందని కేసీఆర్ గమ్మున ఉంటున్నారు.