NTR30: ఎన్టీఆర్ అరాచకం.. కొరటాల సినిమా నుంచి స్పెషల్ వీడియో

-

ఎన్టీఆర్ – కొరటాల కాంబినేషన్లో ఒక సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి కల్యాణ్ రామ్ – కొరటాల స్నేహితుడు మిక్కిలినేని సుధాకర్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుందా .. ఎప్పుడు ఎన్టీఆర్ లుక్ బయటికి వస్తుందా .. అని అందరూ ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. రేపు ఎన్టీఆర్ పుట్టినరోజు కావడంతో, ఆ రోజున సినిమా నుంచి ఏదైనా అప్ డేట్ వస్తుందనే ఆశతో అభిమానులు వెయిట్ చేస్తున్నారు. అనుకున్నట్టుగానే కొంతసేపటి క్రితం స్పెషల్ వీడియోను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. జూనియర్ ఎన్టీఆర్ మరోసారి రౌద్రరూపం ప్రదర్శించేందుకు సిద్ధమయ్యారు.

Fury of 'NTR 30': Jr NTR teams up with Koratala Siva, makers unveil  official announcement video | Telugu Movie News - Times of India

అల్లకల్లోలంగా ఉన్న సముద్రం… ఉవ్వెత్తున ఎగసిపడుతున్న అలలు, అతలాకుతలం అవుతున్న పడవలు… మధ్యలో రెండు చేతులా మారణాయుధాలతో ఎన్టీఆర్ హీరోయిజం ఉట్టిపడేలా వీడియో ఉంది. “అప్పుడప్పుడు ధైర్యానికి కూడా తెలియదు… అవసరానికి మించి దమ్ముండకూడదని” అంటూ బ్యాక్ గ్రౌండ్ లో వినిపించే డైలాగులు సినిమా స్టోరీ సీరియస్ నెస్ ను చాటుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news