Asia Cup 2022 : రోహిత్ కి తప్పిన పెను ప్రమాదం ..వీడియో వైరల్

-

ఆసియా కప్‌ 2022 లో టీమిండియా శుభారంభం చేసిన సంగతి తెలిసిందే. చివరి వరకు ఉత్కంఠంగా సాగిన మ్యాచ్‌ లో టీమిండియా.. 5 వికెట్ల తేడాతో పాక్‌ పై గెలిచింది. మొదట పాకిస్తాన్‌ 19.5 ఓవర్లలో 147 పరుగుల వద్ద ఆలౌట్‌ కాగా.. ఇండియా ఆ లక్ష్యాన్ని 5 వికెట్ల తేడాతో ఛేదించింది.పాక్‌ బ్యాటర్లలో ఓపెనర్‌ రిజ్వాన్‌ 43 పరుగులు చేసి.. రాణించారు. ఇది ఇలా ఉండగా… ఈ మ్యాచ్ సందర్భంగా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ల మధ్య జరిగిన ఓ సంఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

భారత్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఇన్నింగ్స్ ఏడో ఓవర్ ను వేయడానికి షాదబ్ ఖాన్ వచ్చాడు. అతడి బౌలింగ్ లో కోహ్లీ లాంగ్ ఆన్ దిశగా భారీ షాట్ ఆడటానికి ప్రయత్నించాడు. బంతి నేరుగా నాన్ స్ట్రైకింగ్ ఎండ్ లో ఉన్న రోహిత్ శర్మ మీదకు దూసుకెళ్లింది. వేగంగా బంతి రావడంతో ఒక్కసారిగా షాక్ కు గురైన రోహిత్ శర్మ, చేతిని అడ్డుపెట్టాడు. బంతి నేరుగా రోహిత్ శర్మ చేతికి తగిలి పక్కకు వెళ్లిపోగా, అతడు మాత్రం నేలపై పడిపోయాడు. వెంటనే తేరుకొని పరుగు పూర్తి చేశాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news