నేను హాఫ్ సెంచరీ చేసినా నన్నొక ఫెయిల్యూర్ లాగే చూశారు : విరాట్ కోహ్లీ

-

విరాట్ కోహ్లీ.. ఈ పేరుకు ఓ బ్రాండ్ ఉంది. ఆ బ్రాండ్ పై ఫ్యాన్స్ కి చాలా ఆశలున్నాయి. కింగ్ కోహ్లీ మైదానంలో అడుగుపెట్టిన ప్రతిసారి ఫ్యాన్స్ అతను సెంచరీ చేయాలనే కోరుకుంటారు. కానీ ప్రతిసారి మెరుగైన ప్రదర్శన ఇవ్వడం ఏ బ్యాటర్ కు సాధ్యపడని విషయం. కానీ కోహ్లీ లాంటి స్టార్ బ్యాటర్ ను మాత్రం హాఫ్ సెంచరీ చేసినా మెరుగైన ప్రదర్శన ఇచ్చాడని అనుకోరు. ఎందుకంటే స్టార్ బ్యాటర్స్ ఎప్పుడూ ఎక్కువ రన్స్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటారు.

టెస్టులు, వన్డేల్లో కనీసం అర్ధశతకం సాధిస్తే సదరు బ్యాటర్ ఫామ్‌లో ఉన్నట్లుగానే పరిగణిస్తారు. కానీ విరాట్ కోహ్లీ వంటి స్టార్‌ ఆటగాడు మాత్రం గత మూడేళ్లలో దాదాపు పది అర్ధశతకాలు సాధించాడు. అయితే బ్యాటింగ్‌లో ఫామ్‌ కోల్పోయాడనే చర్చ బలంగా సాగింది. తాజాగా యూఏఈ వేదికగా జరుగుతున్న ఆసియా కప్‌లో అఫ్గాన్‌పై విరాట్ కోహ్లీ (122*) సెంచరీ కొట్టి నిరీక్షణకు తెరదించాడు. టీ20ల్లో ఇదే మొదటి శతకం కావడం విశేషం.

‘‘నా క్రికెట్ కెరీర్‌లో అత్యంత ఆశ్చర్యం కలిగించే అంశం ఏంటంటే.. నేను చాలాసార్లు 50లు, 60లు కొట్టినా విఫలమైనట్లు వ్యాఖ్యలు వినిపించాయి. ఆ మ్యాచుల్లో బాగా ఆడినా.. మంచి భాగస్వామ్యం ఇచ్చినా కొందరికి సరిపోలేదు. అయితే దేవుడి దయతో చాలా మంచి జరిగింది. అందువల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉండి మీతో మాట్లాడుతున్నా. కష్టపడి పని చేయడమే మన చేతుల్లో ఉంటుంది. ఇక విధి ఎలా ఉంటే అలా జరుగుతుంది. విరామం తీసుకొని రావడం చాలా మంచి చేసింది. బయట నుంచి చాలా సలహాలు వచ్చాయి. అక్కడ తప్పు చేశావు.. ఇక్కడ తప్పు చేశావు అని చెప్పేవారు. అయితే చివరికి వ్యక్తిగతంగా ఎక్కడ నిలబడ్డావు.. నీ ప్రయాణం ఎలా సాగుతుందనే విషయాలను పరిశీలించుకోవాలి’’ అని విరాట్ కోహ్లీ తెలిపాడు.

Read more RELATED
Recommended to you

Latest news