వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ విజేతగా ఆస్ట్రేలియా.. భారత్ ఘోర పరాజయం

-

WTC final 2023: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ భారత్ కి కలగానే మిగిలింది. వరుసగా రెండవసారి ఫైనల్ వరకు వెళ్లి పరాభవాన్ని చవిచూసింది భారత్. 209 పరుగుల తేడాతో భారత్ పై ఛాంపియన్స్ గా ఆస్ట్రేలియా నిలిచింది. 280 పరుగుల లక్ష్యంతో 5వ రోజు బరిలోకి దిగిన టీం ఇండియా మొదటి నుండి తడబడింది. సెకండ్ ఇన్నింగ్స్ లో 234 పరుగులకే కుప్పకూలింది. 444 పరుగుల రికార్డు టార్గెట్ ను చేదించడంలో రోహిత్ సేన పూర్తిగా విఫలమైంది.

దీంతో ఆస్ట్రేలియా భారత్ పై 209 పరుగుల తేడాతో భారీ విజయం సాధించి ఛాంపియన్ గా నిలిచింది. ఓవెల్ టెస్టులో మొదట టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న టీమిండియా 469 పరుగులు ఆస్ట్రేలియా కి సమర్పించింది. తొలి ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ కి దిగిన భారత్ 296 పరుగులకే ఆలౌట్ అయింది. అనంతరం సెకండ్ ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా 270/8 వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. దీంతో భారత్ 444 పరుగుల లక్ష చేదనకు దిగిన భారత్.. ఈ భారీ లక్ష్యాన్ని చేదించడంలో ఘోరంగా విఫలమైంది.

Read more RELATED
Recommended to you

Latest news