కాంగ్రెస్ నేతలపై తీవ్ర విమర్శలు చేశారు మంత్రి జగదీశ్ రెడ్డి. ఆదివారం ఆయన సూర్యాపేటలో మీడియాతో మాట్లాడుతూ.. బిఆర్ఎస్ పార్టీ పై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేసిన విమర్శలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. నల్గొండ ప్రజలను అడుగడుగునా మోసం చేసిన కాంగ్రెస్ నాయకులు ముందుగా జిల్లా ప్రజలకు క్షమాపణ చెప్పి ముక్కు నేలకు రాయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నాయకుల వల్లే నల్గొండ జిల్లా వెనుకబాటుకు గురైందన్నారు.
కర్ణాటకలో బీఆర్ఎస్ పార్టీ లేదని.. వేరే దిక్కు లేక అక్కడి ప్రజలు కాంగ్రెస్ కి ఓటు వేశారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రానికి లక్ష సార్లు క్షమాపణ చెప్పినా తప్పు లేదన్నారు. పాదయాత్ర పేరుతో నల్గొండకు వచ్చి భట్టి విక్రమార్క సీఎం కేసీఆర్ ని క్షమాపణలు కోరడం విడ్డూరంగా ఉందన్నారు. ఫ్లోరైడ్ ను తొలగించినందుకు కేసీఆర్ క్షమాపణ చెప్పాలా..? అని ప్రశ్నించారు.