టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ టి20 కెప్టెన్ గా రాజీనామా చేసే అవకాశాలు ఉన్నాయా…? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. గత కొన్ని రోజులుగా కోహ్లీ పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అతను మూడు ఫార్మాట్ల భారం మోస్తూ అతని ఆటను ఇబ్బంది పెట్టుకుంటున్నాడు అంటూ పలువురు క్రీడా పండితులు వ్యాఖ్యలు చేస్తున్నారు. అలసిపోయి ఆడాల్సిన అవసరం లేదని మండిపడుతున్నారు.
మూడు ఫార్మాట్లకు ఆడటం, దానికి తోడు కెప్టెన్ గా పని చేయడంతో కోహ్లీ ఎక్కువగా ఇబ్బంది పడుతున్నాడని, దీనితో జట్టు కూడా ప్రమాదంలో పడే అవకాశం ఉందని అంటున్నారు. కోహ్లీ ఆడితే మరో ప్రపంచకప్ ఆడతాడు. వచ్చే ప్రపంచకప్ వరకు అతను కెప్టెన్ గా ఉంటాడో ఉండడో చెప్పే పరిస్థితి లేదు. కాబట్టి ఇప్పటి నుంచి ఒత్తిడి తగ్గించుకుంటే, అప్పుడు అతను కొనసాగే అవకాశం ఉంటుంది అని,
ఒత్తిడి తగ్గించుకుని టి20 బాధ్యతల నుంచి తప్పుకోవాల్సిన అవసరం ఉందని పలువురు సూచిస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా అతను రాజీనామా చేసే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే బోర్డ్ పెద్దలు కూడా కోహ్లీ కి ఇదే విషయం చెప్పారని అంటున్నారు. త్వరలోనే అతను దీనిపై నిర్ణయం వెల్లడించే అవకాశాలు ఉన్నాయని, ఐపిఎల్ జరుగుతున్న సమయంలోనే ఈ విషయాన్ని ప్రకటించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.