ప్రస్తుతం టాలీవుడ్ లో దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న ఆర్ ఆర్ ఆర్ సినిమా సెట్స్ పై ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రేజీ ప్రాజెక్టు లో బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ రాం చరణ్ కి జోడీఅగా నటిస్తోంది. అయితే ఆలియా అద్భుతమైన నటి అంటూ సెట్ లో ఉన్న ప్రతి ఒక్కరికీ చెప్తున్నారట. వాస్తవంగా రాజమౌళి ఇప్పటి వరకు ఆలియా మీద సీన్స్ తీసింది చాలా అంటే చాలా తక్కువని సమాచారం. మరి ఈ టాక్ ఏంటో అర్థం కావడం లేదు. అయితే ‘సాహో’ షూటింగ్ సమయంలో కూడా శ్రద్ధా కపూర్ గురించి ఇలానే ప్రచారం చేశారు. శద్ద కపూర్ టాలీవుడ్ లో సెటిలవడం ఖాయమని ఇక్కడ స్టార్ హీరోయిన్ అవుతుందని ఓ తెగ పోకడలు పోయారు. తీరా చూస్తే మనవాళ్ళు కూరలో కరివేపాకుని తీసినట్టుగా తీసిపారేశారు.
వాస్తవంగా మన తెలుగు వాళ్ళు బాలీవుడ్ హీరోయిన్లకు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తుంటారన్న సంగతి తెలిసందే. టాలీవుడ్ లో ప్రస్తుతం ఉన్న టాప్ హీరోయిన్ అందరూ నార్త్ నుంచి వచ్చినవాళ్ళే. తెలుగమ్మాయిలను వదిలేసి ఈ హీరోయిన్ల కోసం మన దర్శక, నిర్మాతలు వెంపర్లాడుతుంటారు. అక్కడ మేకప్ వేసుకొని మోడలింగ్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ ఖరీదైనా హోటల్ లో రూమిచ్చి, లగ్జరీగా చూస్తూ అనవసరంగా వేయిట్ ఇస్తుంటారు.
కానీ చాలా సందర్భాలలో ఆ హీరోయిన్ వల్ల సినిమాకి పెద్ద డామేజ్ జరిగిపోతుంటుంది. ఉదాహరణ కి సాహో సినిమా తీసుకుంటే అందులో బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ ని తీసుకున్నారు. పాన్ ఇండియా సినిమా కాబట్టి హిందీలో బాగా హెల్ప్ అవుతుందన్న ఉద్దేశ్యంతో మేకర్స్ శ్రద్ధా కపూర్ ని భారీగా రెమ్యూనరేషన్ ఇచ్చి సాహో లో నటింప చేస్తే అది కాస్త సినిమాకి పెద్ద మైనస్ అయింది. మన వాళ్ళు శ్రద్ధా కపూర్ ని ఎందుకనో యాక్సెప్ట్ చేయలేదు. అయితే ఆర్.ఆర్.ఆర్ లో మళ్ళీ బాలీవుడ్ బ్యూటి ఆలియా భట్ ఎంట్రీ ఇస్తుంది. ఈ సారి ఏం జరుగుతుందో చూడాలి. శ్రద్ధా కపూర్ ని కాదన్న తెలుగు ప్రేక్షకులు ఆలియా భట్ ని ఆదరిస్తారో లేదో.