వెస్టిండీస్ జట్టులోకి మళ్లీ డేంజర్ ప్లేయర్ బ్రియాన్ లారా

-

వెస్టిండీస్ డేజంర్ ప్లేయర్ బ్రియాన్ లారా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అయితే, తాజాగా, ఆ వెస్టిండీస్ దిగ్గజ బ్యాటర్ బ్రియాన్ లారా ను కీలక పదవి వరించింది. దశ దిశ లేకుండా ఉన్న విండీస్ జట్టును గాడిన పెట్టేందుకు లారాను పర్ఫామెన్స్ మెంటార్ గా బాధ్యతలు అప్పజెప్పింది.

కొన్నాళ్లుగా విండీస్ జట్టు ప్రదర్శన నాసిరకంగా తయారయింది. చిన్న జట్ల చేతిలోనూ అనూహ్యంగా పరాజయాలు చవిచూస్తూ అనుమానాలు ఎదుర్కొంటుంది. ఈ నేపథ్యంలోనే విండీస్ ను గాడిన పెట్టేందుకే లారాను ఈ పదవికి ఎంపిక చేసినట్లు క్రికెట్ వెస్టిండీస్ పేర్కొంది. మూడు ఫార్మాట్లతో జాతీయ జట్టు, బోర్డు అకాడమీ కోసం పనిచేయనున్నాడు. ఆటగాళ్ళను వ్యూహాత్మక సలహాలను అందించడంలో, వారి గేమ్ సెన్స్ ను మెరుగుపరచడంలో ప్రధాన కోచ్ లకు సహాయం చేయడమే లారా పని అని బోర్డు తెలిపింది.

 

 

Read more RELATED
Recommended to you

Latest news