ఐపీఎల్ 2023 : కోల్కతా జోరుకు బ్రేకులేసిన రాజస్థాన్… టార్గెట్ 150

-

ఈడెన్ గార్డెన్స్ లో జరుగుతున్న రాజస్థాన్ మరియు కోల్కతా జట్ల మధ్య మ్యాచ్ లో మొదటి ఇన్నింగ్స్ ముగిసింది. మొదట బ్యాటింగ్ చేసిన కోల్కతా చాలా పేలవమైన స్కోర్ కు పరిమితం అయింది. సరైన ఆరంభం లభించకపోవడంతో జట్టు స్కోర్ కేవలం 1149 మాత్రమే చేయగలిగింది. ఓపెనర్లు జాసన్ రాయ్ (10) మరియు గుర్బాజ్ (18) లు ఫెయిల్ అవ్వడం ప్రధాన కారణం అని చెప్పాలి. వీరిద్దరూ అవుట్ అయిన తర్వాత వెంకటేష్ అయ్యర్ (57) ఒక్కడే జట్టు స్కోర్ ను నెమ్మదిగా పరుగులు పెట్టించాడు. ఈ దశలో అతను అర్ద సెంచరీని పూర్తి చేసుకున్నాడు, ఈ రోజు రాజస్థాన్ జట్టు బౌలింగ్ ఫీల్డింగ్ అన్ని విభాగాల్లో అద్భుతంగా చేసింది. ముఖ్యంగా ఫీల్డింగ్ లో ఎలక్ట్రిక్ లా చేశారు, హెట్ మేయర్ రెండు వండర్ ఫుల్ క్యాచ్ లు అందుకుని జట్టును బాగా దెబ్బ తీశాడు.

ఇక ప్రతి మ్యాచ్ లోనూ కాస్తో కూస్తో ఆడుతూ వచ్చిన రింకు సింగ్ (16) కూడా విఫలం అయ్యాడు. మరి ప్రస్తుతం రాజస్థాన్ ముందున్న ఈ లక్ష్యాన్ని కోల్కతా బౌలర్లు అడ్డుకుంటారా చూడాలి. బౌలింగ్ లో బౌల్ట్ రెండు వికెట్లు మరియు చాహల్ నాలుగు వికెట్లు తీసుకున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news