విరాట్ కోహ్లీని t-20 ల్లో ఎందుకు కొనసాగిస్తున్నారో అర్థం కావడం లేదు: కపిల్ దేవ్

-

ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే టీ-20ల్లో తుది జట్టు నుంచి విరాట్ కోహ్లీని దూరం పెట్టాల్సిన అవసరం కనిపిస్తోందని టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ అన్నారు. అయితే గత కొంతకాలంగా ఫామ్ లేమితో సతమతమవుతున్న విరాట్ కోహ్లీ ఆట తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మాజీ ఆటగాళ్లు సైతం కోహ్లీకి విశ్రాంతి ఇవ్వాలని, లేదా జట్టు నుంచి తప్పించాలని సూచిస్తున్నారు.

ఈ క్రమంలోనే టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ కోహ్లీ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.” ప్రపంచ నెంబర్ 2 బౌలర్ అయిన అశ్విన్ ను తరచుగా టెస్టుల్లో తుది జట్టుకు దూరం పెడుతున్నప్పుడు.. ప్రపంచ నెంబర్ వన్ బ్యాటర్ ని కూడా తప్పించాల్సిందే. టీ-20ల్లొ కోహ్లీని బెంచ్ కు పరిమితం చేయాల్సిన సమయం ఆసన్నమైంది. ఫామ్ లో ఉన్న ఆటగాళ్లకు తగిన అవకాశాలు ఇవ్వకపోతే వారికి జట్టు యాజమాన్యం అన్యాయం చేస్తున్నట్టే. ఈ విషయంపై సెలక్షన్ కమిటీ ఆలోచించాలి.” అని కపిల్ దేవ్ వ్యాఖ్యానించాడు.

Read more RELATED
Recommended to you

Latest news