ఇండియాకు వరల్డ్ కప్ తీసుకువస్తా అంటున్న స్టార్ క్రికెటర్

హర్దిక్ పాండ్యా ఐపీఎల్ కు ముందు అంత పెద్దగా పట్టించుకోని పేరు. తన ఫామ్ కోల్పోవడంతో ఐపీఎల్ లో ఏ మాత్రం రాణిస్తారో అని చాలా మంది క్రికెట్ క్రిటిక్స్ అనుమానించారు. గుజరాత్ టైటాన్స్ హర్దిక్ పాండ్యాను కెప్టెన్ గా ఎంపిక చేసింది. అయితే ఐపీఎల్ లో తిరిగి ఫామ్ సంపాదించాడు హార్దిక్ పాండ్యా. కెప్టెన్ గా కూడా తనను తాను నిరూపించుకున్నాడు. ఏకంగా ఐపీఎల్ లోకి కొత్తగా ఎంట్రీ ఇచ్చిన గుజరాత్ టైటాన్స్ ను ఛాంపియన్ గా నిలబెట్టాడు. పాండ్యా ఉన్న ఫామ్ పై కొంత మంది నెటిజెన్లు సెటైర్ల కూడా వేశారు. అలాంటి జట్టులో కెప్టెన్ గా ఆటగాడిగా తన సత్తాను చూపించాడు. 

ఇదిలా ఉంటే ఈ సారి ఎలాగైనా ఇండియా ప్రపంచకప్ గెలవాలని అనుకుంటున్నట్లు హార్దిక్ పాండ్యా మనసులోన మాట చెప్పాడు. అందుకోసం తాను వందశాతం ప్రదర్శన ఇస్తానని అన్నాడు. తన జట్టు మొదటిస్థానంలో ఉండటానికి తాను ఏం చేయడానికైనా సిద్ధమే అని వెల్లడించారు. నేను ఎన్ని మ్యాచులు ఆడినా.. టీమ్ ఇండియా తరుపున ఆడటంతో కల నిజమైనట్లుగా భావిస్తానని హర్ధిక్ అన్నాడు.