4వ టీ20లో చెమ‌టోడ్చి నెగ్గిన భార‌త్‌.. ఉత్కంఠగా సాగిన పోరు..

Join Our Community
follow manalokam on social media

అహ్మ‌దాబాద్ లోని న‌రేంద్ర మోదీ స్టేడియం వేదిక‌గా ఇంగ్లండ్‌తో జ‌రిగిన నాలుగో టీ20 మ్యాచ్‌లో భార‌త్ విజ‌యం సాధించింది. భార‌త్ నిర్దేశించిన ల‌క్ష్యాన్ని ఇంగ్లండ్ ముందుగా ఛేదించేట‌ట్లే క‌నిపించింది. కానీ భార‌త బౌల‌ర్లు నైపుణ్యాన్ని ప్ర‌ద‌ర్శించారు. దీంతో ఇంగ్లండ్‌పై భార‌త్ 8 ప‌రుగుల తేడాతో గెలుపొందింది. 4 టీ20 మ్యాచ్ ల సిరీస్‌ను 2-2 తో స‌మం చేసింది.

india won by 8 runs against england in 4th t20

మ్యాచ్ లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ ముందుగా ఫీల్డింగ్ చేప‌ట్టింది. భార‌త్ బ్యాటింగ్ చేసింది. ఈ క్ర‌మంలో భార‌త్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్ల న‌ష్టానికి 185 ప‌రుగులు చేసింది. సూర్య కుమార్ యాద‌వ్‌, శ్రేయాస్ అయ్య‌ర్‌, రిష‌బ్ పంత్‌లు రాణించారు. 31 బంతుల్లో 6 ఫోర్లు 3 సిక్స‌ర్ల‌తో యాద‌వ్ 57 ప‌రుగులు చేయ‌గా, అయ్య‌ర్ 18 బంతుల్లోనే 5 ఫోర్లు, 1 సిక్స‌ర్‌తో 37 ప‌రుగులు చేశాడు. పంత్ 23 బంతుల్లో 4 ఫోర్ల‌తో 30 ప‌రుగులు చేశాడు. ఇంగ్లండ్ బౌల‌ర్ల‌లో ఆర్చ‌ర్ 4 వికెట్లు ప‌డ‌గొట్టాడు. ఆదిల్ ర‌షీద్‌, మార్క్ వుడ్‌, బెన్ స్టోక్స్‌, శామ్ కుర్రాన్‌ల‌కు త‌లా 1 వికెట్ ద‌క్కింది.

అనంత‌రం బ్యాటింగ్ చేప‌ట్టిన ఇంగ్లండ్ 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్ల న‌ష్టానికి 177 ప‌రుగులు చేసింది. ఆ జ‌ట్టు బ్యాట్స్‌మెన్ల‌లో స్టోక్స్ (46 ప‌రుగులు, 4 ఫోర్లు, 3 సిక్స‌ర్లు), జేస‌న్ రాయ్ (40 ప‌రుగులు, 6 ఫోర్లు, 1 సిక్స‌ర్‌)లు రాణించారు. భార‌త బౌల‌ర్ల‌లో శార్దూల్ ఠాకూర్ 3 వికెట్లు తీయ‌గా, హార్దిక్ పాండ్యా, రాహుల్ చాహ‌ర్‌లు చెరో 2 వికెట్లు ప‌డ‌గొట్టారు. భువ‌నేశ్వ‌ర్ కుమార్‌కు 1 వికెట్ ద‌క్కింది.

TOP STORIES

కరోనా సెకండ్ వేవ్: యువతలో కనిపించే 6 అసాధారణ లక్షణాలివే..!

దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం చేస్తోంది. ఇప్పటికే చాలా మంది రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు, సామాన్య ప్రజలు కరోనా బారిన పడుతున్నారు. అయితే తాజాగా...