ఇంగ్లాండ్‌లో జరగనున్న ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. మొత్తం 24 మందితో కూడిన జాబితాను బీసీసీఐ విడుదల చేసింది. నలుగురు యువ క్రికెటర్లను స్టాండ్‌బై ఆటగాళ్లుగా ఎంపిక చేసింది. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ అనంతరం ఇంగ్లాండ్‌తో జరగనున్న 5 మ్యాచ్ ల టెస్టు సిరీస్ కు కూడా టీమ్‌ఇండియాఇదే జట్టుతో బరిలోకి దిగుతుందని బీసీసీఐ తెలిపింది.
భారత జట్టు విషయానికి వస్తే విరాట్ కోహ్లీ(కెప్టెన్), అజింక్య రహానె (వైస్ కెప్టెన్), రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, మయాంక్ అగర్వాల్, ఛటేశ్వర్ పుజారా, హనుమ విహారి, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, జస్ప్రిత్ బుమ్రా, ఇషాంత్ శర్మ, మహ్మద్ షమి, మహ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకుర్, ఉమేశ్ యాదవ్. కేఎల్ రాహుల్, వృద్ధిమాన్ సాహా ఫిట్‌నెస్ పరీక్షలు క్లియర్ చేయాల్సి ఉందని బీసీసీఐ తెలిపింది. అభిమన్యు ఈశ్వరన్, ప్రసిద్ధ్ కృష్ణ, అవేశ్ ఖాన్, అర్జున్ నాగ్‌వస్వల్లాను స్టాండ్‌బై ఆటగాళ్లుగా ఎంపిక చేసింది.
కాగా సౌథాంప్టన్ వేదికగా జూన్ 18 నుంచి న్యూజిలాండ్‌తో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ జరగనుంది. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ అనంతరం ఆగస్టు 4 నుంచి ఇంగ్లాండ్‌తో 5 మ్యాచ్ ల టెస్టు సిరీస్ ఆడనుంది. దీనికోసం భారత జట్టు త్వరలోనే ఇంగ్లాండ్‌కు బయలుదేనుంది. కరోనా నేపథ్యంలో భారత ఆటగాళ్ళు ముందుగా క్వారటైన్ పూర్తి చేసుకొని ప్రాక్టీస్ మొదలెట్టనున్నారు.